ENGLISH

గ్లామ్‌షాట్‌: ఎల్లో హాట్‌ అందాల అమైరా.!

19 April 2019-15:30 PM

గ్లామర్‌తో కేక పుట్టించే హాట్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌ ఈ మధ్య కాస్త గ్లామర్‌ తగ్గించిందెందుకో. ఈ హాట్‌ బ్యూటీ అప్పియరెన్స్‌ కోసం నెట్టింట్లో ఫాలోవర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు మరి. అలాంటిది అమ్మడు ఇలా తన అందాలను దాచేస్తే ఎలా.? కాస్త లేట్‌ అయినా, లేటెస్ట్‌గా ఈ మధ్య ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. ఎల్లో కలర్‌ హాట్‌ వేర్‌లో అమైరా అందాలు సరికొత్త అప్పీల్‌నిస్తున్నాయి. గ్లామర్‌ ఓ ఎత్తు. ఆమె కళ్లు ఇంకో ఎత్తు. ఆ కళ్లలోనే ఏదో మత్తు. 

 

అందాలు దాచేసినా, కళ్లతోనే ఇవ్వాల్సిన కిక్కిచ్చేస్తోన్న అమైరా పిక్‌కి జై కొట్టాల్సిందే ఎవరైనా. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. తెలుగులో 'మనసుకు నచ్చింది' అంటూ తెరంగేట్రం చేసింది. కానీ ఎందుకో మెప్పించలేకపోయింది. కానీ మళ్లీ వస్తానంటోంది. తప్పకుండా ఆకట్టుకుంటానంటోంది. చర్చల దశలో కొన్ని ప్రాజెక్టులు అమైరా చేతిలో ఉన్నాయట. ఫైనల్‌ చేసి త్వరలోనే ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెబుతానంటోంది అందాల అమైరా దస్తూర్‌. 

ALSO READ: స్వీటీ హవా మళ్లీ మొదలైందిగా.!