ENGLISH

టాలీవుడ్‌లో జీరో రెమ్యునరేషన్‌ సాధ్యమేనా.?

04 September 2020-14:00 PM

తెలుగు సినిమా కష్టాల్లో వుంది. తెలుగు సినిమా మాత్రమే కాదు, కన్నడ సినిమా.. తమిళ సినిమా.. హిందీ సినిమా.. ఆ మాటకొస్తే, ప్రపంచ వ్యాప్తంగా సినిమా.. నిజంగానే ‘సినిమా కష్టాల్ని’ చవిచూస్తోంది కరోనా కారణంగా. ఈ నేపథ్యంలో నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా అంతా కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. తాజా పరిణామాలపై నేచురల్‌ స్టార్‌ నాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘జీరో రెమ్యునరేషన్‌’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అంటే, రెమ్యునరేషన్‌ లేకుండానే నటించడం ఈ ‘జీరో రెమ్యునరేషన్‌’ ఉద్దేశ్యం. ఇది జనరల్‌ స్టేట్‌మెంట్‌ కాదట.

 

కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నాడు నాని. ఇది మంచి ఆలోచనే. కానీ, ఎంతవరకు వర్కవుట్‌ అవుతుంది.? సినిమా అనేది సవాలక్ష లెక్కలతో కూడుకుని వుంటుంది. క్రేజ్‌ని బేస్‌ చేసుకుని రెమ్యునరేషన్లు వుంటాయి. క్రేజ్‌ వున్నప్పుడే రెమ్యునరేషన్లు చక్కబెట్టేసుకోవాలని నటీనటులే కాదు.. దర్శక నిర్మాతలూ భావిస్తుంటారు. సో, జీరో రెమ్యునరేషన్‌ అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి అంతా ఒక్క మాట మీద నిలబడాల్సి వుంటుంది. నాని మాత్రం ‘నేను రెడీ’ అంటున్నాడు.

 

వాస్తవానికి చాలామంది నటీనటులు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకోవడానికి ముందుకొస్తున్నారు కూడా. అదీ ఒకందుకు మంచిదే. అసలంటూ దియేటర్లు ముందు ముందు మనుగడ సాధిస్తాయా.? లేదా.? అన్న అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా ఆలోచనలు సినిమా పరిశ్రమకి కొంత ఊరటే.

ALSO READ: ప్ర‌భాస్ విల‌న్ వీకైపోయాడేంటి?