ENGLISH

'రంగస్థలం'లో ఆది ఏం చేయబోతున్నాడంటే!

13 March 2018-08:30 AM

యంగ్‌ హీరోగా తన టాలెంట్‌ చూపించిన ఆది పినిశెట్టి, ఈ మధ్య విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్‌ అందుకుంటున్నాడు. యంగ్‌ అండ్‌ స్టైలిష్‌ విలన్‌గా నటించి తనలోని డిఫరెంట్‌ యాంగిల్‌ని పరిచయం చేశాడు ఆది పినిశెట్టి. ఇప్పుడి ఆది నటిస్తున్న తాజా చిత్రం 'రంగస్థలం'. సుకుమార్‌ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇంతవరకూ 'రంగస్థలం' నుండి వచ్చిన టీజర్లు, పోస్టర్స్‌, ఆడియో సింగిల్స్‌ ఓ రేంజ్‌లో జనాన్ని ఎట్రాక్ట్‌ చేస్తుండగా, తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఆది ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మరింత ఆశక్తి రేకెత్తిస్తోంది. 'లాంతర్‌ గుర్తుకే మీ ఓటు' అంటూ ఆది ఉన్న ఓ పోస్టర్‌ తాజాగా విడుదలైంది. రంగస్థలం గ్రామ పంచాయితీ ఎలక్షన్స్‌లో ప్రెసిడెంట్‌ అభ్యర్దిగా గ్రామ ప్రజలు బలపరిచిన కె. కుమార్‌ బాబుకే మీ ఓటు.. అని రాసుంది ఆ పోస్టర్‌ మీద. ఇప్పుడీ పోస్టర్‌ 'రంగస్థలం' సినిమాపై మరింత ఆశక్తిని రేపుతోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అన్నయ్యగా కుమార్‌ బాబు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది. సినిమాకి ఈ పాత్ర ఎంతో కీలకమట. 

ఆది నటించిన సినిమాల్లో ఈ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందనీ అంటున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సునాయాసంగా నటించగలడు ఆది. అలాంటిది అక్కడున్నది సుకుమార్‌. కొంచెం యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్నా, వారి నుండి ఎంత లాగాలో బాగా తెలిసిన సుకుమార్‌, మన యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఆది నుండి ఎంత కంటెన్ట్‌ లాగాడో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు మాత్రమే ఆగాలిక. ఈ నెల 30న 'రంగస్థలం' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: అసభ్యమైన కామెంట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి