ENGLISH

సన్నీలియోన్‌ బయోపిక్‌లో 'ఆ' ఎపిసోడ్‌ ఉంటుందా?

13 March 2018-07:30 AM

పోర్న్‌ స్టార్‌గా పరిచయమైన సన్నీలియోన్‌ బాలీవుడ్‌ తెరపై స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. హీరోయిన్‌గానే కాకుండా, హాట్‌ ఐటెం గాళ్‌గా కూడా అలరిస్తోంది. సోషల్‌ మీడియాలోనూ సన్నీలియోన్‌కి రికార్డు స్థాయిలో ఫాలోవర్స్‌ ఉన్నారన్న సంగతి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మధ్యనే ఈ ముద్దుగుమ్మ సౌత్‌ సినిమాలపై కూడా కన్నేసింది. ఆల్రెడీ తెలుగులో అమ్మడి ఎంట్రీ అయిపోయింది. ఇటీవలే సన్నీ ఐటెం సాంగ్‌లో నటించిన 'గరుడవేగ' చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. తాజాగా 'వీర మహాదేవి' అంటూ ఓ పీరియాడిక్‌ మూవీలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తోంది సన్నీలియోన్‌. 

ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు సన్నీలియోన్‌ బయోపిక్‌ వస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా ఈ హాట్‌ భామే ప్రకటించింది. తెరపై సన్నీలియోన్‌ జీవితం వేరు. ఆమె పర్సనల్‌ జీవితం వేరు. ఈ రెండు వేరియేషన్స్‌నీ సినిమాలో చూపిస్తారట. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్‌. సన్నీలియోన్‌ గతం విషయం అందరికీ తెలిసిందే. పోర్న్‌ రంగం నుండి, వెండితెరకు పరిచయమైన సన్నీలియోన్‌, సినిమాల్లోకి వచ్చాక పోర్న్‌ రంగాన్ని విడిచిపెట్టేసింది. అయితే సినిమాలో సన్నీలియోన్‌ పోర్న్‌ ఎపిసోడ్‌ చూపిస్తారా? అలా చూపిస్తే, అది మన ఇండియన్‌ సినిమా కట్టుబాట్లకు వ్యతిరేకమవుతుంది. 

సో పోర్న్‌ ఎపిసోడ్‌ ఉంటుందో లేదో అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ సన్నీలియోన్‌ అసలు పేరైన కరణ్‌జీత్‌ కౌర్‌లోని 'కరణ్‌జీత'్‌ అనే టైటిల్‌ని ఈ బయోపిక్‌కి పెట్టనున్నారట. అసలింతకీ సన్నీ బయోపిక్‌ సినిమా కాదట. ఓ వెబ్‌ సిరీస్‌ అట. సన్నీ పర్సనల్‌ అండ్‌ సినిమా జీవితంలోని పలు ఆశక్తికరమైన అంశాలను ఈ బయోపిక్‌లో చూపించనున్నారట. సన్నీలియోన్‌ బయోపిక్‌ అంటే అందరిలోనూ క్యూరియాసిటీనే. చూడాలి మరి ఈ బయోపిక్‌ ఎప్పుడు సెట్స్‌ మీదికెళుతుందో!

ALSO READ: అసభ్యమైన కామెంట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి