ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన చిక్కుముడులన్నీ ఒకదాని తరువాత మరొకటి విడిపోతూనే ఉన్నాయి.
తాజాగా ఎన్టీఆర్ భార్య అయిన బసవతారకం పాత్రలో ఎవరు కనిపించనున్నారు అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది అని చెబుతున్నాయి ఎన్టీఆర్ బయోపిక్ యూనిట్ వర్గాలు. అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నటి నయనతార ఈ పాత్రని చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది.
ఇప్పటికే బాలయ్య సరసన పలు కీలక చిత్రాలలో ముఖ్య పాత్రల్లో మెరిసిన నయనతార మరోసారి ఇంతటి గొప్ప చిత్రంలో చాలా ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరవనుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వెళ్ళనుంది. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ALSO READ: మరో ప్రముఖ నటి కూతురు సినీ ఎంట్రీ