నటీనటుల వారసులు తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాలలోకి అడుగుపెట్టడం మనం చూస్తూనే ఉంటాము. అలా సినిమాలలోకి వచ్చి హిట్ అయిన వారు చాలామంది ఉన్నారు, కొంతమంది నిలదొక్కుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు.
ఇక తాజాగా వారసుల జాబితాలోకి చేరనుంది ప్రముఖ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మి. ఈమె తెరంగేట్రం చేయబోయే చిత్రం ఏంటో తెలుసా- వర్మ (అర్జున్ రెడ్డి చిత్రానికి తమిళ రీమేక్). ఇప్పటికే ఈ చిత్రంలో ప్రముఖ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ నటిస్తుండగా ఆయన సరసన ఇప్పుడు మరో స్టార్ వారసురాలు నటిస్తుండడం ఈ సినిమా పైన అంచనాలని భారీగా పెంచేస్తున్నది.
ఇదిలావుండగా అర్జున్ రెడ్డి చిత్రం తనకి ఎంతగానో నచ్చడంతో నేషనల్ అవార్డు గ్రహీత అయిన బాలా స్వయంగా ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరు వారసులని ఆయన ఎలా ఆవిష్కరిస్తాడు అన్నది తెరపైన చూడాలి.
వర్మ ఈ సంవత్సరం విడుదలకానుంది.
ALSO READ: అమితాబ్ బచ్చన్- వెయ్యి కోట్ల అధిపతి