ENGLISH

అమితాబ్ బచ్చన్- వెయ్యి కోట్ల అధిపతి

13 March 2018-10:30 AM

భారతీయ చలనచిత్ర పరిశ్రమ మొత్తంలోనే లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన నటుడు అమితాబ్ బచ్చన్. ఇక ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల సంఖ్య కోట్లల్లో ఉంటుంది అనేది ఒక పచ్చి నిజం. 

అయితే ఈ మధ్యనే ఆయన గురించిన ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే- అమితాబ్-జయ బచ్చన్ ల ఆస్తుల విలువ రూ 1000కోట్లు దాటింది అని తెలిసింది. ఇది చెప్పింది మరెవరో కాదు స్వయానా జయా బచ్చన్. 

ఆమె తాజాగా సమాజ్ వాది పార్టీ నుండి రాజ్యసభకి MP గా పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించగా అందులో సుమారు రూ 1000కోట్లకు పైగా ఉన్నట్టు సంబందిత పత్రాలని ఆమె ఎన్నికల సంఘానికి అందచేశారు. 

దీనితో బచ్చన్ కుటుంబానికి చెందిన లెక్కలు బయటకివచ్చాయి.

 

ALSO READ: సన్నీలియోన్‌ బయోపిక్‌లో 'ఆ' ఎపిసోడ్‌ ఉంటుందా?