సినిమాల్లో హీరోయిన్‌గా నాటీ లుక్స్‌తో బబ్లీగా కనిపించిన ముద్దుగుమ్మ మాధవీ లత త్వరలోనే చచ్చిపోతుందట. అదేంటీ.? అనుకుంటున్నారా.? నటనతో పాటు, ఈ మధ్య కొన్ని పొలిటికల్ డిబేట్స్‌లోనూ, సామాజిక ఇష్యూ బేస్‌డ్ డిస్కషన్స్‌లోనూ పాల్గొని తనదైన గడుసుతనాన్ని ప్రదర్శించిన ముద్దుగుమ్మ మాధవీ లతకు ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సుల్లేవన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో ఛాన్సుల కోసం పాప చేయని ప్రయత్నాల్లేవని కూడా చెప్పాలి.
అయితే, తాజాగా మాధవీలత ఓ సరికొత్త పబ్లిసిటీ స్టంట్‌కి శ్రీకారం చుట్టింది. లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో 'నేను చచ్చిపోతాను..' అంటూ ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌కి నెటిజన్లు తమదైన శైలిలో రిప్లైలు ఇస్తున్నారు. ఇంతకీ మాధవీలతకు చచ్చిపోవాల్సినంత కష్టమేమొచ్చిందనుకుంటున్నారా.? హెల్త్ ఇష్యూస్ అట. అయితే, అవేమీ బయటికి చెప్పుకోలేనంత సివియర్ హెల్త్ ఇష్యూస్ కూడా కావు. మైగ్రేన్, దగ్గు, జలుబు వంటి సాధారణ జబ్బులేనట. అయితే, పాపకి ఏ మందు పడితే, ఆ మందు వాడేసే చెడ్డ అలవాటుందట. మందు అంటే మెడిసెన్స్ తీసుకోవడమండీ బాబూ. అలా విచ్చలవిడిగా మందులు వాడేస్తే ఎలా ఉంటుందో సినిమాటిగ్గా ఓ హీరోయిన్‌ని కూడా గుర్తు చేసిందండోయ్. ఆమె ఎవరో కాదు, 'ప్రేమ' సినిమాలో రేవతి. ఆమెకు క్యాన్సర్ కాబట్టి చచ్చిపోయింది. దగ్గు, జలుబుకే చచ్చిపోతే.. ఇక ఈ భూమ్మీద పుట్టుకొచ్చే కొత్త రోగాల మాటేంటీ.? అవునులెండి.
ఆ కొత్త మాయరోగం (కరోనా వైరస్) ఒకటి ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చింది కదా. దాని లక్షణాలు మాధవీ లత చెప్పుకొచ్చే లక్షణాలే. పబ్లిసిటీ సంగతెలా ఉన్నా, ఆఖరికి దగ్గు, జలుబుకు కూడా భయపడే మాయదారి రోజులైపోయాయ్ మరి.
ALSO READ: Madhavi Latha Latest Photoshoot