ENGLISH

టాలీవుడ్‌లో పెళ్లి బాజా... పెళ్లికూతురు కానున్న హీరోయిన్‌!

06 June 2020-12:23 PM

లాక్ డౌన్ స‌మ‌యంలోనూ టాలీవుడ్‌కి పెళ్లి క‌ళ వ‌చ్చింది. ఆ మ‌ధ్యే నిఖిల్ పెళ్లి సింపుల్‌గా అయ్యింది. రానా పెళ్లి నిశ్చ‌య‌మైంది. త్వ‌ర‌లోనే నితిన్ కూడా పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నాడు. ఈలోగా మ‌రో హీరోయిన్ పెళ్లి ఖాయ‌మైపోయింద‌ని టాక్‌. త‌నే.. మాధ‌వీల‌త‌. న‌చ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాధ‌వీల‌త‌. ఆ త‌ర‌వాత కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు రాజ‌కీయాల్లో బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే మాధ‌వీల‌త పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోంద‌ని టాక్‌.

 

''నా జీవితంలో కొన్ని అనూహ్య‌మైన మార్పులు, అద్బుతాలు జ‌రిగాయి. కొన్ని నెల‌లుగా సంతోషంగా ఉన్నా.ఆ సంతోషానికి కార‌ణ‌మైన విషయాన్ని త్వ‌ర‌లోనే చెబుత' అంటూ ట్వీట్ చేసింది మాధ‌వీల‌త‌. దాంతో.. మాధ‌వీ ల‌త ప్రేమ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి క‌బురు చెబుతుంద‌న్న ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. `మీరు ప్రేమ‌లో ప‌డ్డారా? పెళ్లి చేసుకుంటారా?` అని నెటిజ‌న్లు అడిగితే అవున‌నీ, కాద‌ని స‌మాధానం చెప్ప‌డం లేదు. దాంతో మాధ‌వీల‌త పెళ్లి ఖాయ‌మే అన్న ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం వ‌చ్చిన‌ట్టైంది.

ALSO READ: జ‌గ‌న్ మీటింగ్‌... బాల‌య్య లేకుండానేనా?