హా! ఈ ఫోటోలో ఏం గ్లామరేముందిలే అనుకుని చూపు పక్కకు తిప్పుకుంటున్నారా?
ఆగండాగండి శారీలో అచ్చమైన అందం ఉందంటే నమ్మి తీరాల్సిందే. మూసే చోట మూసి, చూసే చోట చూపించేదే చీర కట్టు అందం. అందుకే చీరలోనే గ్లామరంతా ఒలకబోసేయొచ్చునని నమ్ముతుంటారు ముద్దుగుమ్మలు. అయితే ఆ చీరకట్టు కట్టే తీరు కొంచెం తెలుసుకుంటే చాలంతే. అందాల ఆదాశర్మ ఫ్యాషన్‌లో టాప్ అన్న సంగతి తెలిసిందే. నార్మల్ ఫ్యాషన్‌లోనే సమ్‌థింగ్ డిఫరెంట్ లుక్‌ని పరిచయం చేస్తుందీ బ్యూటీ.
ఆమె ధరించిన కాస్ట్యూమ్ దగ్గర నుండీ, ధరించే ఇతరత్రా యాక్సెసరీస్ వరకూ అంతా స్పెషలే. అందుకే ఆదా అందాల గని అనిపించుకుంటుంది. గ్లామర్‌లో సూపర్బ్ టేస్ట్ ఉన్న బ్యూటీ ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ప్రభుదేవా నటిస్తోన్న 'చార్లీ చాప్లిన్ 2' చిత్రం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ALSO READ: హీరోయిన్ హన్సిక పై చీటింగ్ కేసు నమోదు..!