'అజ్ఞాతవాసి' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ అనే న్యూస్ లీక్ అవడంతో, అమ్మడి రేంజ్ అమాంతం ఎక్కడికో పెరిగిపోయింది. ఇక ఎక్కడ చూసినా, అనూ పేరే. ఏ హీరో నోటి వెంట విన్నా అనూ ఇమ్మాన్యుయేలే అన్నట్లుగా ఈ మలయాళ కుట్టి పేరు మార్మోగిపోయింది.
ఏ సినిమా అయితే తనకు అంత పాపులారిటీని తెచ్చిపెట్టిందో అదే సినిమా వచ్చిన పాపులారిటీ అంతా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. అలా అని ఒక్క సినిమాతో కెరీర్ డౌన్ అయిపోయిందని చెప్పలేం. కానీ ఆ ఎఫెక్ట్ కొంత కాలం ఉంటుందని మాత్రం చెప్పగలం. అనూ ఇమ్మాన్యుయేల్ 'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్ నుండి ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంది. సైలెంట్‌గా ఆఫర్లు దక్కించుకుంటోంది. బన్నీతో సూర్య సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ఇప్పటికే మరో రెండు సినిమాలున్నాయి. సో ప్రెజెంట్ అమ్మడి కెరీర్‌కి ఏమాత్రం ఢోకా లేదనే చెప్పాలి.
ఇకపోతే 'ముకుందా' బ్యూటీ పూజా హెగ్దే. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌పై కన్నేయడంతో టాలీవుడ్‌కి కాస్త దూరమైంది. తర్వాత 'డీజె' సినిమాలో అమ్మడి బికినీ గ్లామర్‌కి వచ్చిన క్రేజ్‌తో మళ్లీ టాలీవుడ్‌లో పిచ్చ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడయితే టాలీవుడ్‌లో పూజా నామజపం చేస్తున్నారంతా అంటే నమ్మాల్సిందే మరి. ఆల్రెడీ 'రంగస్థలం'లో చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో ఆడి పాడిన ఈ బ్యూటీ, ఇప్పుడు మహేష్, ప్రబాస్ వంటి స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంటోంది.
'భరత్ అనే నేను' సినిమా తర్వాత మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రానున్న సినిమాకి హీరోయిన్‌గా పూజా హెగ్దేని ఎంచుకున్నారు. అలాగే 'సాహో' తర్వాత ప్రబాస్ చేయబోయే సినిమాలో కూడా పూజానే హీరోయిన్ అంటున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోందీ క్యూట్ భామ. ఈ సమ్మర్‌లోనే 'సాక్ష్యం' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ: హీరోయిన్ హన్సిక పై చీటింగ్ కేసు నమోదు..!