యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడు పాపం. ఎందుకంటారా? బరువు తగ్గేందుకు. ఎన్టీఆర్ కొత్త సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో దర్శకత్వంలో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొంచెం స్లిమ్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే తెగ కసరత్తులు చేస్తున్నాడు.
అలా సీరియస్‌గా కసరత్తులు చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ల్లాయిడ్ స్టీవెన్స్ ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎన్టీఆర్‌కి ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇస్తోంది ఈయనే. 'జై లవకుశ' సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ముద్దుగుమ్మ పూజా హెగ్దేని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో, ఈ సినిమాపై త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. ముందుగా అనుకున్న దానికంటే స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చేస్తున్నాడట. సబ్జెక్ట్ పవర్‌ఫుల్‌గా ఉండాలనే యోచనతోనే త్రివిక్రమ్ ఈ మార్పులు చేస్తున్నాడట.
భారీ అంచనాల నడుమ తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా అనూహ్యంగా బెడిసికొట్టడంతో ఎన్టీఆర్ సినిమాపై ఫుల్ లెంగ్త్ కాన్‌సన్‌ట్రేషన్ చేశాడట త్రివిక్రమ్. 'అజ్ఞాతవాసి' విషయంలో చోటు చేసుకున్న చిన్నా చితకా లోపాలను బేరీజు వేసుకుంటున్నాడట. సో ఆ రకంగా ఈ సినిమాకి అద్భుతమైన స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ముందుగా అనుకున్న అనిరుధ్ ప్లేస్‌లోకి తమన్ వచ్చి చేరిన విషయం కూడా విదితమే.
ALSO READ: హీరోయిన్ హన్సిక పై చీటింగ్ కేసు నమోదు..!