ENGLISH

కాజల్‌ చాలా కాస్ట్‌లీ గురూ!

14 March 2018-10:10 AM

సీనియర్‌ హీరోయిన్‌ అయినా కానీ వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతోన్న భామ ఎవరా అంటే అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ అని ఠక్కున చెప్పేయొచ్చు. అవకాశాల పరంగా ఇప్పుడొస్తున్న కొత్త భామలతో పోటీ పడుతోంది ముద్దుగుమ్మ కాజల్‌. ఎంతమంది కొత్త భామలున్నా, ఈ ముద్దుగుమ్మకి పోటీ కావడం లేదు. తన ప్లేస్‌ని భర్తీ చేయలేకపోతున్నారు. 

అందంలోనూ, అభినయంలోనూ కూడా ఇదే మాట వర్తిస్తుంది కాజల్‌ విషయంలో. ఇకపోతే రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే, అక్కడ కూడా కాజల్‌ ది గ్రేట్‌ అని చెప్పక తప్పడం లేదు. అందరూ ఆశ్చర్యపోయేలా, ఎవ్వరూ ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకుంటోందట కాజల్‌ అగర్వాల్‌. అందులోనూ ఇప్పుడు కాజల్‌ పట్టిందల్లా బంగారమే. కెరీర్‌ క్లోజ్‌ అయిపోయిందనుకున్న టైంలో కాజల్‌కి 'ఖైదీ' రూపంలో బంపర్‌ ఆఫర్‌ దొరికింది. ఇక అక్కడి నుండి కాజల్‌ కెరీర్‌ మళ్లీ యూ టర్న్‌ తీసుకుంది. దాంతో కాజల్‌ బండి ఫుల్‌ స్పీడు అందుకుంది. 

'ఖైదీ' తర్వాత కాజల్‌ ఐటెం సాంగ్‌ చేసిన 'జనతా గ్యారేజ్‌' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఎప్పటి నుండో సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్‌ తేజకి కెరీర్‌ అద్భుతంగా టర్న్‌ అయ్యేందుకు కాజల్‌ లక్కే కలిసొచ్చిందనడంలో అతిశయోక్తి కాదు. చిన్న హీరోలతో సినిమాలు తీసే తేజ ఆ తర్వాతి నుండి స్టార్‌ హీరోలకు వేసిన గాలం కలిసొచ్చింది. ఒకేసారి విక్టరీ వెంకటేష్‌, బాలయ్యలతో సినిమాలు ఓకే చేశాడు. 

ఇలా కాజల్‌ లక్‌ తనకే కాదు, తనతో పని చేసిన వారికి కూడా లాభించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' సినిమాలో నటిస్తోంది. ఇది కాక బాలీవుడ్‌ 'క్వీన్‌' తమిళ రీమేక్‌ అయిన 'ప్యారిస్‌ ప్యారిస్‌'లోనూ కాజల్‌ నటిస్తోంది.

ALSO READ: హీరోయిన్ హన్సిక పై చీటింగ్ కేసు నమోదు..!