ENGLISH

మళ్ళీ సుక్కూతో చరణ్‌, సొంత బ్యానర్‌లోనట!

14 March 2018-08:30 AM

మెగా కాంపౌండ్‌ హీరోతో సినిమా చేసే ఛాన్స్‌ వచ్చిందంటే డైరెక్టర్స్‌కి పండగే. అలాంటిది ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా ఛాన్స్‌ అంటే ఆ పండక్కి అంతే ఉండదు. 

ఆల్రెడీ ప్రస్తుతం ఆ ఛాన్స్‌ కొట్టేసిన డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'ధృవ' సినిమా తెరకెక్కించి, హిట్‌ కొట్టిన సురేందర్‌ రెడ్డి, తర్వాత ఏకంగా కుంభస్థలాన్నే కొట్టేశాడు. మెగా వపర్‌ స్టార్‌ నుండి, మెగాస్టార్‌తో సినిమా చేసే ప్రమోషన్‌ కొట్టేశాడు. నిజంగా సురేందర్‌ రెడ్డికి ఇది బంపర్‌ ఆఫరే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి బంపర్‌ ఛాన్స్‌కే వెయిటింగ్‌లో ఉన్న మరో డైరెక్టర్‌ క్రియేటివిటీ పెట్టింది పేరైన సుకుమార్‌. 

ప్రస్తుతం సుకుమార్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో 'రంగస్థలం' సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిట్‌ అయితే ఇక సుకుమార్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఇది పక్కా. ఈ సంగతిటుంచితే, 'రంగస్థలం' షూటింగ్‌ టైంలో సుకుమార్‌ కమిట్మెంట్స్‌ని, డెడికేషన్‌ని దగ్గర నుండి అబ్జర్వ్‌ చేసి, ఇంప్రెస్‌ అయిన రామ్‌చరణ్‌ తన సొంత బ్యానర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌లో సుకుమార్‌కి మరో సినిమా చేసే ఛాన్స్‌ ఇచ్చాడనీ తెలుస్తోంది.  

తాజా సమాచారం ప్రకారం ఈ బ్యానర్‌లో తన తండ్రి మెగాస్టార్‌తో సినిమా చేసే ఛాన్స్‌ సుకుమార్‌కి ఇచ్చే ఆలోచనలో చరణ్‌ ఉన్నాడనీ తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చిరంజీవి ఇదే బ్యానర్‌లో 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా సుకుమార్‌ డైరెక్షన్‌లోనే ఉండినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. ఏది ఏమైనా చరణ్‌ లెక్క చాలా పక్కాగా ఉంటుందంతే!

ALSO READ: నటి హన్సిక పైన నమోదు అయిన ఫిర్యాదు