ENGLISH

తాడాటతో 'జీరోసైజ్‌': ట్రై చేస్తారా?

15 June 2018-19:41 PM

ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్‌ ఫీట్స్‌తో, పిక్స్‌తో ఆదాశర్మ సోషల్‌ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. ఈ మధ్య ఆదాశర్మ ఓ మేగ్జైన్‌ కోసం ఫోటో షూట్‌ చేయించుకుంది. పడవలో బికినీలో తన అందమైన నాజూకు శరీరాన్ని విల్లులా వంచేసి, తెగ ఫీట్లు చేసేసింది. నెటిజన్లు ఆ ఫోటోలు చూసి అవాక్కవ్వడమే తమ వంతైంది. అంతలా ఆదా తన ఒళ్లు ఎలా వంచేసిందా? అని ఆశ్చర్యపోయారు. ఆమె ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. 

అయితే అప్పుడు ఆదా వాటికి సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పింది. ఎలాగంటారా? ఈ సారి మరో ఫీట్‌ చేసి చూపించిందండోయ్‌. తాడుకు తల్లకిందులుగా వేలాడి అప్పుడు నన్నడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం అని చెప్పిందీ క్యూట్‌ అండ్‌ హాట్‌ బ్యూటీ. ఇలా చేయడాన్ని 'మల్లకంభ' అంటారు. ఈ రోజు అంతర్జాతీయ మల్లకంభ దినోత్సవం అట. ఈ ముద్దుగుమ్మే చెప్పిందిది కూడా. ఆ సందర్భంగానే ఈ ఫీట్‌ తానే స్వయంగా చేసి చూపిస్తూ, ఆ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఇలా చేయడం వల్లే తనకి అంత అందమైన శరీరం వచ్చిందని ఆదా చెబుతోంది. అంతేకాదు ఇలా తాడును బ్యాలెన్స్‌ చేయడానికి తగినంత శక్తి స్ధిరత్వం ఉండాలంటోంది అందాల ఆదా. అంత క్యూట్‌గా ఇంత ప్రాక్టికల్‌గా ఆదా చెప్పిన తర్వాత ట్రై చేయకుండా ఉంటారా? బట్‌ బీ కేర్‌ఫుల్‌ బేబ్స్‌.!

ALSO READ: Qlik Here For The Gallery Of Adah Sharma