ENGLISH

'అదుగో' పంది పిల్ల వచ్చేస్తోందదిగో!

02 October 2017-14:54 PM

డైరెక్షన్‌లో వినూత్న శైలి రవిబాబుది. నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా నటిస్తూనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు రవిబాబు. ఆయన బుర్రలో మెదిలిన క్రియేటివ్‌ థాట్‌కి దృశ్య రూపం ఇచ్చాడు. అదే 'అదుగో' సినిమా. ఇందులో హీరో ఓ పందిపిల్ల అన్న సంగతి తెలిసిందే. ఈ పందిపిల్లను పట్టుకుని వినూత్న రీతిలో రవిబాబు పబ్లిసిటీ స్టంట్‌ కూడా చేశాడు గతంలో. పెద్ద నోట్ల రద్దు టైంలో డబ్బుల కోసం ఏటీమ్‌ వద్ద పందిపిల్లతో పాటు క్యూల్‌ నిలబడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తాజాగా ఈ సినిమాకి ప్రీ టీజర్‌ని రిలీజ్‌ చేసి మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యాడు. సినిమా గురించి, సినిమాలో హీరో అయిన పందిపిల్ల గురించి రవిబాబు గొప్పగా పొగుడుతూంటే, పక్కనే ఉన్న పందిపిల్ల మాత్రం రవిబాబును తిడుతూ, పంచ్‌ డైలాగులేస్తోంది. అదిరిపోయిందిలెండి ఈ ప్రీ టీజర్‌. సినిమా కూడా అలాగే అదిరిపోతుందని రవిబాబు చెబుతున్నాడు. అయినా రవిబాబు సినిమాలు జనానికి సుపరిచితమే కదా. సింపుల్‌గానే ఏదో మ్యాజిక్‌ చేస్తూ ఉంటాడు. ఈ సారి ఆయన మ్యాజిక్‌కి 'బంటి' అనే పందిపిల్ల కేంద్ర బిందువయ్యింది. కామెడీ సినిమా చేసినా, హారర్‌ మూవీ చేసినా డైరెక్షన్‌లో రవిబాబు స్టైలే వేరు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన 'అవును', 'అవును - 2' సినిమాలు హారర్‌ జోనర్‌లో మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా వస్తోన్న ఈ 'అదుగో' కూడా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం!

ALSO READ: అదుగో ప్రీ-టీజర్ చూడండి