ENGLISH

Adipurush, Dil Raju: 'ఆదిపురుష్‌' సెల్‌ఫోన్‌లో చూసి అంచనా వేయలేం : దిల్ రాజు

07 October 2022-09:43 AM

''ఆది పురుష్ లాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోన్‌లో చూసి సినిమాను అంచనా వేయలేం. వీఎఫ్‌ఎక్స్‌ సినిమాలను థియేటర్‌లో పూర్తి జనాలతో చూస్తే అర్థమవుతుంది. ‘ఆదిపురుష్‌’ కూడా అలాంటి సినిమానే. ఇప్పుడు 3డీలో విజువల్స్‌ చూస్తే చాలా బాగుంది'' అన్నారు నిర్మాత దిల్ రాజు. ప్రభాస్‌ కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆది పురుష్‌ 3డీ టీజర్‌ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు దిల్ రాజు.

 

‘ఆది పురుష్‌’ టీజర్‌ ఎప్పుడు వస్తుందా? అని ప్రభాస్‌ అభిమానులే కాదు, నేనూ ఆసక్తిగా ఎదురు చూశా. టీజర్‌ నాకు చాలా నచ్చింది. టీజర్‌ రెస్పాన్స్‌ కనుక్కొందామని నలుగురైదుగురికి కాల్ చేస్తే, ‘ట్రోలింగ్‌ చేస్తున్నారు సర్‌’ అని చెప్పారు. ‘బాహుబలి-1’ మొదటిసారి చూసి బయటకు వచ్చినప్పుడు అందరూ ట్రోలింగ్‌ చేశారు. శివలింగాన్ని ఎత్తుకుని ప్రభాస్‌ వచ్చే ఫొటోకు జండూబామ్‌ పెట్టి పోస్టులు చేశారు. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి.

 

ఓం రౌత్‌ ‘ఆదిపురుష్‌’ తీస్తున్నప్పుడు ‘తానాజీ’ చూసి ఆశ్యర్యపోయా. ‘ఆది పురుష్‌’ ఒక మేజిక్‌ ఫిల్మ్‌ అవుతుందని నేను అనుకుంటున్నా. జనవరి 12న ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేస్తోంది. '' అన్నారు.

ALSO READ: గాడ్ ఫాద‌ర్ ఎంత‌కి అమ్మారు? ఎంత రావాలి?