ENGLISH

The Ghost: హిందీలో రిలీజ్‌.. డ్రాప్ అయిన‌ట్టే!

07 October 2022-10:00 AM

ఈ దస‌రాకి బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఢీ కొట్టిన మ‌రో సినిమా... `ది ఘోస్ట్`. గాడ్ ఫాద‌ర్‌తో పోటీ ప‌డ‌లేక డీలా ప‌డింది. ఈ సినిమాకి టాకే కాదు... వ‌సూళ్లు కూడా చాలా డ‌ల్‌గా ఉన్నాయి. దీనికంటే స్వాతిముత్యం సినిమాకి మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. బాక్సాఫీసు ద‌గ్గ‌ర నాగ్ కి మ‌రో డిజాస్ట‌ర్ గా ట్రేడ్ పండితులు కూడా తేల్చేశారు. ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాల‌ని విడుద‌ల‌కు ముందు నాగ్ ప‌ట్టుబట్టాడు. దానికీ ఓ కార‌ణం ఉంది. నాగ్ బాలీవుడ్ లో న‌టించిన `బ్ర‌హ్మాస్త‌` మంచి వ‌సూళ్ల‌ని ద‌క్కించుకొంది. ఈ సినిమాతో నాగ్ అక్క‌డ పాపుల‌ర్ అయ్యాడు.

 

ఈ క్రేజ్ `ది ఘోస్ట్`కి వాడుకోవాల‌ని చూశాడు. అందుకే హిందీలో డబ్ చేసి, రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లెట్టారు. అయితే.. టైమ్ స‌రిపోలేదు. అందుకే బుధ‌వారం ఈ సినిమా బాలీవుడ్ లో విడుద‌ల కాలేదు. అయితే..ఇప్పుడు విడుద‌ల అవ్వ‌క‌పోవొచ్చు. ఎందుకంటే... తెలుగులో ఈ సినిమాకి దారుణ‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. టాక్ కూడా బాలేదు. ఇలాంటి మెటీరియ‌ల్ తో.. బాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని గెలుచుకోవ‌డం చాలా క‌ష్టం. అందుకే ఇప్పుడు హిందీ రిలీజ్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం మిన‌హా మ‌రో మార్గం లేదు.

ALSO READ: గాడ్ ఫాద‌ర్ ఎంత‌కి అమ్మారు? ఎంత రావాలి?