ENGLISH

Adipurush: ఆదిపురుష్‌... రిలీజ్ ఎప్పుడు..?

01 November 2022-15:02 PM

ఈ సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన సినిమాల్లో ఆదిపురుష్ ఒక‌టి. కానీ... అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డింది. సంక్రాంతికి ఈ సినిమా రావ‌డం లేదు. 2023 వేస‌విలో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. సంక్రాంతికి బాలీవుడ్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర పోటీ ఎక్కువ‌గా ఉంది. దాంతో పాటుగా ఆదిపురుష్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌నులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో వాయిదా వేయ‌క త‌ప్ప‌డం లేదు. అయితే... కొత్త రిలీజ్ డేట్ ప‌ట్ల మాత్రం చిత్ర‌బృందం క్లారిటీతోనే ఉంది. ఈ సినిమాని మే 12న విడుద‌ల చేయాల‌ని చూస్తోంది.

 

ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమా. కాబ‌ట్టి... అన్ని భాష‌ల్లోనూ పోటీ లేకుండా చూసుకోవాలి. రిలీజ్ డేట్ కూడా ముందే ఫిక్స్ చేసుకొంటే - మిగిలిన సినిమాల‌కు కూడా వెసులు బాటు ఉంటుంది. అందుకే... జ‌న‌వ‌రిలో కంటే... మే 12న వ‌స్తే బాగుంఉటంద‌ని నిర్మాతలు భావిస్తున్నారు. వేస‌వి సెల‌వ‌లు ఆదిపురుష్‌కి క‌లిసొచ్చే ఛాన్స్ ఉంది. దాదాపుగా రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందిన చిత్ర‌మిది. ఆ మొత్తం తిరిగి రాబ‌ట్టుకోవాలంటే.. రిలీజ్ డేట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అందుకే సంక్రాతి బ‌రి నుంచి త‌ప్పుకొంది.

ALSO READ: విల‌న్ గా విశాల్‌... లోకేష్ మాస్ట‌ర్ ప్లాన్‌