ENGLISH

Vishal: విల‌న్ గా విశాల్‌... లోకేష్ మాస్ట‌ర్ ప్లాన్‌

01 November 2022-13:02 PM

మంచి క‌థ వ‌స్తే... విల‌న్ గా న‌టించ‌డానికి తాను సిద్ద‌మే అని.. విశాల్ చాలా సార్లు ప్ర‌క‌టించాడు. అయితే అలాంటి క‌థ ఇప్ప‌టి వ‌ర‌కూ దొర‌క‌లేదు. అందుకే విశాల్ క‌ల‌.. క‌ల‌గానే మిగిలిపోయింది.

 

ఇప్పుడు అలాంటి అవ‌కాశం విశాల్ ముందు నిలిచింది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాలో విల‌న్ గా విశాల్ అయితే బాగుంటుంద‌ని లోకేష్ భావిస్తున్నాడ‌ట‌. లోకేష్ సినిమాలో విల‌న్ పాత్ర‌లు చాలా బ‌లంగా ఉంటాయి. హీరోతో పోలిస్తే... విల‌న్ కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. పైగా లోకేష్ సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. అందుకే... ఈ పాత్ర చేయ‌డానికి విశాల్ ముందుకొచ్చాడ‌ని తెలుస్తోంది. విజ‌య్ ప్ర‌స్తుతం `వార‌సుడు`తో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. దాంతో లోకేష్ క‌న‌గ‌రాజ్‌కి కాల్షీట్లు ఇచ్చాడు. ఇటీవ‌ల లోకేష్ విశాల్ ని క‌లిసి క‌థ మొత్తం చెప్పాడ‌ట‌. విశాల్ కూడా ఈ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌. త్వ‌ర‌లోనే విల‌న్ గా విశాల్ ఎంట్రీ పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంది.

ALSO READ: ఈవారం బాక్సాఫీస్‌.. చిన్న చిత్రాల జాత‌ర‌