ENGLISH

Adipurush: ఆదిపురుష్ చిన్న పిల్ల‌ల సినిమానా?

03 October 2022-10:34 AM

ప్ర‌భాస్ అభిమానులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న `ఆది పురుష్‌` టీజ‌ర్ వ‌చ్చేసింది. దాదాపు 100 సెక‌న్ల టీజ‌ర్ ఇది. ట్రైల‌ర్ అంత లెంగ్త్ లో క‌ట్ చేశారు. ప్ర‌భాస్ నోటి నుంచి వ‌చ్చిన డైలాగులు అదిరిపోయాయి. రాముడిగా ప్ర‌భాస్ లుక్ కూడా బాగుంది. కాక‌పోతే... ఆ మేకింగ్ చూసి క‌ళ్లు తేలేస్తున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.

 

కార్ట్యూన్ నెట్ వ‌ర్క్ లో వ‌చ్చే బొమ్మ‌ల క‌థ‌లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. రావ‌ణ బ్ర‌హ్మ‌గా సైఫ్ అలీ ఖాన్ అయితే అస్స‌లు సెట్ అవ్వ‌లేద‌ని ప్ర‌భాస్ అభిమానులే చెబుతున్నారు. పైగా క‌ళ్ల‌కు సుర్మా త‌గిలించుకొన్నాడేమో..? రావ‌ణుడు ఇస్లాం మ‌తం ఎప్పుడు పుచ్చుకొన్నాడంటూ వ్యంగ్యంగా కామెంట్లు విసురుతున్నారు. టీజ‌ర్‌లో చూపించిన విజువ‌ల్ ఎఫెక్ట్స్ అంత గొప్ప‌గా ఏం లేవు. సినిమా అంతా బ్లూ మాట్‌లో తీసి చుట్టేసిన‌ట్టు అనిపిస్తోంది. ఏదేమైనా ప్ర‌భాస్ కోస‌మో, లేదంటే రామాయ‌ణాన్ని వెండి తెర‌పై మ‌రోసారి చూడాల‌న్న కుతూహ‌లంతోనే `ఆదిపురుష్` చూడాలి. అంత‌కు మించిన ఎఫెక్ట్స్ కోసం వెళ్లే... నిరాశ ఎదురుకాక త‌ప్ప‌ద‌న్న‌ది సినీ విశ్లేష‌కుల మాట‌. కాక‌పోతే ఇది టీజ‌రే. ట్రైల‌ర్ రావాలి.

 

సినిమా విడుద‌ల కావాలి. సినిమాలో.. విజువ‌ల్స్ అదిరిపోతే అప్పుడు ఈ అనుమానాల‌న్నీ తేలిపోతాయి. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతోంది.

ALSO READ: 'ఆచార్య' త‌ప్పుని స‌రిదిద్దుకొన్న 'గాడ్ ఫాద‌ర్‌'