ENGLISH

Hunt Teaser: టీజర్ : సుధీర్ బాబు డబుల్ 'హంట్'

03 October 2022-12:31 PM

సుధీర్‌బాబు కొత్త సినిమా ‘హంట్‌’ . పోలీస్‌ కథతో సిద్ధమవుతోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహేశ్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు.

 

టీజర్ లో సినిమా కథని పరిచయం చేశారు. ‘‘అతను అర్జున్‌ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్‌ బీ. ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా ‘బీ’కి తెలియవు’’ అంటూ మంజుల చెప్పే సంభాషణలతో ప్రారంభమైన టీజర్‌ మొత్తం యాక్షన్ తో నింపారు. ఇందులో సుధీర్‌బాబు ది డబుల్ యాక్షన్ అని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. ఈ అర్జున్‌ ‘ఏ’, ‘బీ’ ఎవరు? అనేది ఇందులో సస్పెన్స్. శ్రీకాంత్‌ కూడా ఇందులో కీలక పాత్ర పోహిస్తున్నారు.

 

సుధీర్ కి ఎప్పటి నుండో మంచి యాక్షన్ సినిమా చేయాలని వుంది. హంట్ లో యాక్షన్ చూస్తుంటే సుధీర్ బాబు కోరిక తీరినట్లే కనిపిస్తుంది. ఇంటెన్స్ రో, పర్ఫెక్ట్ ఫిజిక్ ఆకట్టుకున్నాడు సుధీర్ బాబు. హై యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేశారు. బ్రాన్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. త్వలోనే సినిమా విడుదల తేదిని ప్రకటిస్తారు.

ALSO READ: 'ఆచార్య' త‌ప్పుని స‌రిదిద్దుకొన్న 'గాడ్ ఫాద‌ర్‌'