ENGLISH

అమీ తుమీ అదిరింది సుమీ

08 June 2017-16:25 PM

విలక్షణ చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. నేచురల్‌ స్టార్‌ నానిని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్‌ ఈయనే. తెలుగు వారికి ఎక్కువ అవకాశాలుంటాయి ఈయన సినిమాల్లో. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'అష్టా చెమ్మా' సినిమా అందించిన వినోదం అంతా ఇంతా కాదు. అదో రకం తెలీని అనుభూతిని అందిస్తుంది ఆ సినిమాలో కామెడీ. చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. తాజాగా ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'అమీ తుమీ'. ఈ సినిమా కూడా అదే తరహాలో ప్రేక్షకుల్ని అలరిస్తుందంటున్నారు చిత్ర యూనిట్‌. అవసరాల శ్రీనివాస్‌, అడవి శేష్‌ హీరోలుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. అదితి మ్యాకల్‌, ఈషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తెలుగు వాళ్లే. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది అదిరిపోయే కామెడీ ఉందని. అంతేకాదు ఆరోగ్యకరమైన వినోదంలా అనిపిస్తోంది. దాంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల్లో కూడా ఆశక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న అడవి శేష్‌కి ఈ సినిమాతో మంచి పేరు వచ్చేలా ఉందని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే 'రన్‌ రాజా రన్‌', 'క్షణం' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆడవి శేష్‌కి ఈ సినిమా మరింత గుర్తింపు తెచ్చి పెట్టాలని ఆశిద్దాం. 

ALSO READ: రిలీజ్ కి ముందే ‘జగన్నాధం’ వేడుకలు