ఈ ఏడాది సంక్రాంతికి ఆరుగురు హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. గేమ్ చేంజర్ తో అంజలి, కియారా అద్వానీ. డాకు మహారాజ్ తో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి. వీరందరూ సంక్రాంతి సినిమాలపై మంచి హోప్స్ పెట్టు కున్నారు. కారణం ఇప్పటివరకు పెద్దగా గుర్తింపులేని పాత్రలు చేయటం. ఇప్పడు అంతా మంచి ఫేమ్ ఉన్న వాళ్లు కావటంతో భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వీరందరిలో అనుకున్న పేరు తెచుకున్నది ఐశ్వర్యా రాజేష్ మాత్రమే అని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ లో అంజలి పాత్రకి మంచి పేరు వచ్చినా, సినిమాలో స్కోప్ తక్కువ ఉంది.
ఐశ్వర్యా రాజేష్ మాత్రం సినిమా మొత్తం మెరిసి తన నటనతో ఆకట్టుకుంది. కెరియర్ స్టార్ట్ చేసిన ఇన్నాళ్ళకి తెలుగులో మొదటి హిట్ అందుకుంది. అలనాటి హీరో రాజేష్ కూతురైన ఐశ్వర్య తెలుగులో అవకాశాలు రాక కోలీవుడ్ లో రాణిస్తోంది. కానీ ఇప్పడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఐశ్యర్య నటన, ఆహార్యంతో స్టార్ హీరోయిన్ సౌందర్యని తలపించింది. వెంకీ, భాగ్యం జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
ఐశ్వర్య అచ్చమైన ఇల్లాలి పాత్రలోనూ, నలుగురు పిల్లల తల్లిగాను అద్భుతంగా నటించి మెప్పించింది. ఐశ్వర్య నటనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వెంకటేష్-సౌందర్య కాంబినేషన్ కి ఉన్నంత క్రేజ్ ఒకే ఒక్క సినిమాతో వెంకీ - ఐశ్వర్య జోడీ తెచ్చుకుంది. సౌందర్య, మీనా తరువాత ఆ రేంజ్ లో వెంకీ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది ఐశ్వర్య తోనే అనటంలో సందేహం లేదు. ఇక నుంచి నటనకి ఆస్కారమున్న పాత్రల్లో, సీనియర్ హీరోలకి జోడీగా కూడా ఐశ్వర్య పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంతా నమ్ముతున్నారు. మొత్తానికి ఐశ్వర్య కలలు ఈ సంక్రాంతి నెరవేర్చింది.
ALSO READ: తమన్ యాక్షన్ కి చిరు రియాక్షన్