ENGLISH

వెరైటీ టైటిల్ తో నాగ చైతన్య

20 January 2025-13:19 PM

అక్కినేని నాగచైతన్య ఇప్పుడిప్పుడే అన్ని రకాలుగా కుదుట పడుతున్నాడు. ఇన్నాళ్లు వ్యక్తిగత జీవితం ఒడిదుడుకుల్లో ఉండగా, సినీ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రీసెంట్ గా శోభిత ధూళిపాళని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యాడు. కెరియర్ లో కూడా స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం తండేల్ అనే పాన్ ఇండియా సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నెక్స్ట్ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మూవీ కమిటయ్యాడు. ఇది చైతుకి 24వ సినిమా. మైథలాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీని వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు. అందుకే సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి సారి విభిన్న జోనర్ లో నటిస్తున్నాడు చైతు. దూత వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ కాగా ఇది మైథిలాజికల్  థ్రిల్లర్. చైతు కెరియర్ లోనే హైబడ్జెట్ మూవీ గా తెరకెక్కుతోంది. అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మిగతా నటీనటులు ఎవరన్నది టీమ్ అనౌన్స్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీకి టైటిల్ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి 'వృష‌క‌ర్మ‌' అనే  టైటిల్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.

విరూపాక్ష అని వెరైటీ టైటిల్ తో ఆకట్టుకున్న కార్తీక్ ఇప్పుడు కూడా అలా భిన్నంగా ఉంటూ, ఆసక్తి పెంచేలా ఈ 'వృషకర్మ' టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. వృష‌క‌ర్మ‌ అంటే కార్య‌సాధ‌కుడు, చేసే ప‌నిపై అత్యంత శ్ర‌ద్ద ఉన్న‌వాడు అని అర్థం మని తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తూ టైటిల్స్ కూడా క్యాచీగా ఉంటున్నాయి. అన్ని బాషలవాళ్ళకి అర్ధం అయ్యేలా. చైతు సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడం  కొంత రిస్క్ అనే చెప్పాలి. మాస్ ఆడియన్స్ కి ఈ టైటిల్ రీచ్ అయ్యేలా లేదన్నది అక్కినేని ఫాన్స్ వాదన.