ENGLISH

షూటింగ్ లో గాయపడ్డ అజిత్?!

31 May 2017-22:31 PM

తమిళ స్టార్ హీరో అజిత్ షూటింగ్ లో గాయపడినట్టు తెలుస్తుంది.

అందుతున్న వివరాల ప్రకారం, యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంలో ఆయన గాయపడినట్టు సమాచారం. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఏమి వెలువడలేదు.

గాయం చిన్నది అయినందునే ఈ విషయాన్ని బయటపెట్టట్లేదు అని కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్. అయితే యాక్షన్ సీన్స్ ని డూప్ లేకుండా చేసే అలవాటున్న అజిత్ కి ఇటువంటి చిన్న చిన్న ప్రమాదాలు ఆయనకీ షరామాములే!

 

ALSO READ: దాసరి మృతికి సంతాపంగా సూపర్ స్టార్ కృష్ణ తీసుకున్న నిర్ణయం!