ENGLISH

ఇక్క‌డ హిట్టు స‌రే... రీమేక్ చేస్తే ఆడుతుందా?

08 December 2021-11:00 AM

2021లో వ‌చ్చిన అతి పెద్ద హిట్స్‌లో అఖండ ఒక‌టి. ఈ ప్ర‌వాహం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లి ఆగుతుందో తెలీదు గానీ, ప్ర‌స్తుతానికైతే బాల‌య్య కెరీర్‌లో ఇది అతి పెద్ద హిట్టు. బాల‌య్య సినిమాలు గ‌తంలోనూ మంచి విజ‌యాలు అందుకున్నాయి. కానీ ఈ స్థాయి వ‌సూళ్లు రాలేదు. దానికి తోడు.. ఎప్పుడూ లేని విధంగా రీమేక్ రైట్స్ కోసం... కొంత‌మంది ప‌ర‌భాషా నిర్మాత‌లు ఎగ‌బ‌డుతున్నార‌ని టాక్‌. ముఖ్యంగా హిందీ రైట్స్ కోసం ఓ అగ్ర నిర్మాత బోయ‌పాటి శ్రీ‌ను చుట్టూ తిరుగుతున్నాడ‌న్న వార్త‌లొస్తున్నాయి. ఈడీల్ ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజునే తీసుకొచ్చార్ట‌.

 

అఖండ తెలుగులో పెద్ద హిట్టు. నిజ‌మే. కాక‌పోతే... ఈ సినిమా పూర్తిగా బాల‌య్య ఇమేజ్ పై న‌డిచింది. అఖండ‌గా బాల‌య్య‌ని త‌ప్ప ఇంకెవ్వ‌రినీ చూడ‌లేం. ఆ డైలాగులు చెబితే బాలయ్యే చెప్పాలి. ఆ ఫైటింగులు చేస్తే బాల‌య్యే చేయాలి. ఇలాంటి స్టామినా ఉన్న హీరో బాలీవుడ్ లోనూ లేడు. చేస్తే అక్ష‌య్ కుమార్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ చేయాలి. వాళ్లు చేసినా ఇంత క్రేజ్ రాదు. తెలుగులో హిట్ట‌య్యింది క‌దా అని ఆ క‌థ‌ని రీమేక్ చేసుకోవ‌డానికి ఎగ‌బ‌డుతున్నారు త‌ప్ప, బాల‌య్య‌ని రిప్లేస్ చేసే హీరో ఎవ‌రూ బాలీవుడ్ లో లేరన్న‌ది నిజం. మ‌రి .. బాలీవుడ్ లో అఖండ‌గా ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి.

ALSO READ: చిరుకి చేతిలో ఉన్నవి స‌రిపోవా?