ENGLISH

యాక్సిడెంట్ చేసి అడ్డంగా బుక్ అయిన బుల్లి తెర స్టార్‌

08 December 2021-12:15 PM

బుల్లి తెర న‌టి ల‌హ‌రి ఇబ్బందుల్లో ప‌డ్డారు. ఓ రోడ్డు ప్ర‌మాదానికి కార‌ణ‌మయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మంగ‌ళ‌వారం రాత్రి శంషాబాద్ నుంచి కారులో వ‌స్తున్న ల‌హ‌రి.. ఓ బైక్ ని ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో... ల‌హ‌రినే డ్రైవింగ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో వాహ‌న చోద‌కుడికి గాయాల‌న్న‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు గాయ‌ప‌డిన వ్య‌క్తిని స్థానిక హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. అయితే.. పోలీసులు వ‌చ్చేంత వ‌ర‌కూ ల‌హ‌రి.. కారు నుంచి కింద‌కు దిగ‌లేదు.

 

పోలీసులు వ‌చ్చాక‌... ల‌హ‌రిని గుర్తించారు. కేసు న‌మోదు చేసి, ల‌హ‌రిని ఇంటికి పంపేశారు. ఈరోజు... ల‌హ‌రి షంషాబాద్ పోలీస్ స్టేష‌న్‌లో హాజ‌రు కావాల్సివుంది. యాక్సిడెండ్ విష‌యంలో త‌ప్పు ఎవ‌రిది? అనే విష‌యంలో పోలీసులు ఇంకా ఎలాంటి నిర్దార‌ణ‌కు రాలేదు. గాయాలు చిన్న‌వైతే.... ల‌హ‌రి పెద్ద రిస్క్ నుంచి త‌ప్పించుకున్న‌ట్టే. లేదంటే ఇబ్బందుల్లో ప‌డాల్సి ఉంటుంది.

ALSO READ: ఇక్క‌డ హిట్టు స‌రే... రీమేక్ చేస్తే ఆడుతుందా?