నాగచైతన్య కథానాయకుడిగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అదే.. థ్యాంక్యూ. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, అవికాగోర్ కథానాయికలు. ఈ చిత్రాన్ని థియేటర్‌కి కాకుండా... ఓటీటీ ద్వారా విడుదల చేయాలని... చిత్రబృందం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అమేజాన్ నుంచి... దిల్ రాజుకి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చిందని, దాంతో.. దిల్ రాజు అమేజాన్ కే ఈ సినిమా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ డీల్ ఎంతకు క్లోజ్ అయ్యింది? విడుదల ఎప్పుడు? అనే వివరాలు బయటకు రావాల్సివుంది.
దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించిన `వి` సినిమా కూడా ఇలానే ఓటీటీ ద్వారా విడుదలైంది. అమేజాన్ ఈ సినిమాని 33కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడే... మరో రెండు సినిమాల్ని కూడా ఓటీటీకే ఇస్తానని దిల్ రాజు ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే థ్యాంక్యూ ని కూడా ఓటీటీకి ఇచ్చేస్తున్నారని సమాచారం. భారీ టేబుల్ ప్రాఫిట్ రావడం వల్లే, ఈ సినిమాని దిల్ రాజు ఓటీటీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: చిరుకి చేతిలో ఉన్నవి సరిపోవా?