సెంచరీ సినిమాల మైలు రాయిని అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు. ఆయనవన్నీ కమర్షియల్ హిట్లే. అయితే అన్నమయ్య, శ్రీరామదాసుతో.. ఆయనలోని రెండో కోణం బయటపడింది. గత కొంతకాలంగా దర్శకత్వం వైపు నుంచి నటనవైపుకు ఫోకస్ మార్చారు రాఘవేంద్రరావు. కొత్త పెళ్లి సందడిలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా కూడా రూపుదిద్దుకుంటోందని సమాచారం. అయితే ఈలోగా మళ్లీ ఆయన దృష్టి మెగాఫోన్ వైపుకు మళ్లింది.
నాగార్జునతో తీసిన ఓం నమో వెంకటేశాయ దర్శకుడిగా ఆయన చివరి చిత్రం. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. వంద సినిమాల ప్రయాణాన్ని ఫ్లాప్ తో ఆపకూడదని, ఓ హిట్ సినిమా తీసి, అప్పుడు రిటైర్‌మెంట్ తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఓ భారీ మల్టీస్టారర్ కోసం స్కెచ్ వేస్తున్నారు. రాఘవేంద్రరావు రామాయణ గాధని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నార్ట. ఇదో మల్టీస్టారర్ అని, ఈ సినిమాతో ఆయన దర్శకత్వానికి పుల్ స్టాప్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. రాఘవేంద్రరావు కెరీర్‌లో ఎంతోమంది సూపర్ స్టార్లతో పనిచేశారు. వాళ్లంతా ఈ సినిమాలో అతిథి పాత్రల్లో దర్శనమిస్తారని టాక్. ఆ విధంగా దర్శకుడిగా రాఘవేంద్రుడి కెరీర్‌కి ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
ALSO READ: యాక్సిడెంట్ చేసి అడ్డంగా బుక్ అయిన బుల్లి తెర స్టార్