ENGLISH

అంగరంగ వైభవంగా సుమతీ శతకం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

05 February 2026-19:30 PM

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు లభించాయి. సుభాష్ ఆనంద్ సంగీతం పాటలకు మరింత ప్రాముఖ్యతను పెంచింది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే ప్రమోషన్స్ టూర్ లో చక్కటి స్పందన తెచ్చుకుంది సుమతి శతకం చిత్ర బృందం. అందరికీ అందుబాటు ధరలలో టికెట్లు ఉంటాయని తెలుపుతూ విడుదల తేదీ దగ్గరవుతున్న ఈ సమయంలో చిత్ర బృందం మీడియా వాడుతూ ఇంటరాక్ట్ అవుతూ ఇటీవలే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 
 

హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఒక సామాన్య స్థాయి నుండి మొదలై ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. నాకు వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకుంటూ ఇప్పుడు ఎంతో మహత్తరమైన అవకాశం సుమతీ శతకం ద్వారా మీ ముందుకు వచ్చాను. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నన్ను నేను నిరూపించుకుంటాను. నాకు ఈ సినిమాతోనే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో మీ అందరికీ మా దర్శక నిర్మాతలు గురించి చెప్పాలి. నాకంటే పెద్ద నటులు ఉన్నప్పటికీ నాకు అవకాశం ఇచ్చారు, దానికి నాకు ధన్యవాదాలు. చిన్న నాయుడు, ప్రదీప్ గారు ఈ సినిమాకు మరొక మూల స్థంభంగా నిలబడ్డారు. నాకు మంచి పాటలు రాసి, పాడి, సంగీతాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే నాతో ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరికీ థాంక్స్. అలాగే నేను రవితేజ గారు అంటే కేవలం ఇష్టం కాదు, ఆయన నాకు గురువు. ఆయన నా ఇన్స్పిరేషన్. సుమతీ శతకం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. స్టార్ మా నాకు చాలా సపోర్ట్ చేశారు. రవితేజ గారితో ఉండే శ్రీను గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శైలికి తెలుగు రాకపోయినా చాలా కష్టపడి కొంత వరకు నేర్చుకుని సినిమాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర హీరోనే. ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంటుంది. మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కన్నడలో కెవిఎన్, తమిళ్ లో జికె డిస్ట్రిబ్యూటర్స్ కి వారికి థాంక్స్" అన్నారు. 
 

హీరోయిన్ శైలి చౌదరి మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ సినిమాలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం కష్టపడ్డాము. నన్ను నమ్మి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా రెవీల్ చేయలేదు కానీ సినిమాలో మీరు నా పాత్ర చూసి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. నాకు మీ అందరి ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 

దర్శకుడు ఎం.ఎం. నాయుడు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా సినిమాను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా నిర్మాత సాయి సుధాకర్ గారు నాకు ప్రతి విషయంలో అండగా ఉన్నారు. నేను ఆయనకు రుణపడి ఉంటాను అనే మాట కూడా చాలా చిన్నది. సినిమాకు ఆయన ఇన్పుట్స్ తీసుకుని పని చేశాము. నాకు ఈ సినిమా ప్రయాణంలో నా సోదరుడు నాయుడు, అలాగే నా కోడైరెక్టర్ గారు ఒక గురువులా ఉండి నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సినిమా కథ అమర్దీప్ గారికి చాలా నచ్చి ఓకే చేశారు. ఆయన గాయపడి కూడా సినిమా కోసం ఎక్కడ వెనకడుగు వేయకుండా పని చేశారు. నటి శైలి గారు ఆరోగ్యం బాగున్న కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదే విధంగా సినిమా కోసం కెమెరామెన్, సంగీత దర్శకులు అలాగే ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరూ చాలా కష్టపడి సినిమాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి సినిమాకు మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు. 
 

నిర్మాత కొమ్మలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సుమతీ శతకం ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పై మాకు నమ్మకం ఉంది. సెన్సార్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్, అలాగే కంటెంట్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ కు మంచి స్పందన లభించింది. మాతో పాటు విడుదల అవుతున్న సినిమాలు అన్నింటికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. అలాగే మా సినిమాను ఇరు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న మైత్రి మూవీస్ కు, అలాగే కన్నడలో కెవిఎన్, తమిళ్ లో జికె డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. మమ్మల్ని అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. టికెట్ ధర అందరికీ అందుబాటులో సింగిల్ థియేటర్ లో 100, మల్టీప్లెక్స్ లో 150 రూపాయిలు మాత్రమే ఉంటుంది" అన్నారు. 
 

నటి శైలజ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈ సినిమాలో పని చేసిన అందరినీ నేను నా బిడ్డలలా చూసాను. మాస్ మహారాజ్ రవితేజ గారి మొదటి సినిమా నుండి చూస్తున్నాము. ఆ రవితేజ వీరాభిమాని మన అమర్దీప్ చౌదరి సినిమా ఇప్పుడు మన ముందుకు వస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం సుమతీ శతకం. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ ఈ సినిమాను చూసి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు. 

సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ... "నాకు ఈ సినిమాలో అవకాశం ఇచి నన్ను సొంత మనిషిలా చూసిన నిర్మాతకు నా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న సమయంలో కూడా బ్యాక్గ్రౌండ్ లో పని చేస్తూనే ఉన్నాము. ఈ సినిమాకు పాటలు రాసిన వారికి, పాడిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాతో నేను అమర్దీప్ ఫ్యాన్ అయిపోయాను. మరొక సారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను " అన్నారు. 
 

నటుడు టేస్టీ తేజ మాట్లాడుతూ... "మా సుమతీ శతకం సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో మనకు తెర మీద కనిపించే హీరో అమర్దీప్ కాని కనిపించని హీరోలు మా నిర్మాత, దర్శకుడు, రచయిత అలాగే దర్శక బృందం. అలాగే సినిమాకు మంచి సంగీతం వచ్చింది. నాతో కూడా డాన్స్ చేయించారు. శైలి చౌదరి తెలుగు రాకపోయినా కష్టపడి నేర్చుకుని ఈ సినిమా కోసం పని చేశారు. అలాగే మా అమర్ ఈ సినిమాతో మంచి విజయం చూస్తాడు. ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది అమర్ వల్లనే. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను " అన్నారు. 
 

జెడివి ప్రసాద్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాకు అందరికీ ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. చిత్ర ట్రైలర్, టీజర్ చూసిన అందరూ చాల పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 
 

రైటర్ నాయుడు మాట్లాడుతూ... "ముందుగా మా దర్శకుడు ఎంఎం నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిత్ర బృందం అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. యూత్, ఫ్యామిలీస్ అందరూ మా సినిమాను చూసి ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాను" అన్నారు. 

నటీనటులు:
అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు. 

సాంకేతిక వర్గం:
 బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
 నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి
 రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు
 సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్
 సంగీతం: సుభాష్ ఆనంద్
 ఎడిటర్: నహిద్ మహమ్మద్
 పిఆర్ఓ: మధు విఆర్
 డిజిటల్ మార్కెటింగ్: హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం