ENGLISH

Ali: పాపం అలీ.. క‌క్క‌లేక మింగ‌లేక‌

29 October 2022-09:00 AM

అలీ ప‌రిస్థితి క‌క్క‌లేక .. మింగ‌లేక అన్న‌ట్టు త‌యారైంది. ఏపీ ప్ర‌భుత్వం అలీని ఎలక్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుడుగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. అలీ రెండేళ్ల పాటు ప‌ద‌వీకాలంలో ఉంటారు. నెల‌కు దాదాపుగా రూ.3 ల‌క్ష‌ల జీతం.. ఇత‌ర ఎల‌వెన్సులూ ల‌భిస్తాయి. కానీ.. అలీ ఈ విష‌యంలో ఏమాత్రం సంతోషంగా లేడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

 

ఎందుకంటే అలీ క‌ల‌లు, ఆశ‌లు భారీగా ఉండేవి. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇస్తార‌ని అనుకొన్నారంతా. క‌నీసం వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎం.ఎల్‌.ఏ సీటైనా వ‌స్తుంద‌ని ఆశ ప‌డ్డారు. నామినేటెడ్ ప‌ద‌వులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని దాదాపుగా మినిస్ట‌ర్ హోదాతో స‌మాన‌మైన‌వి. వాటిపై అలీ.. క‌న్నేశారు. కానీ... ఏమాత్రం ప్రాధాన్యం లేని స‌ల‌హాదారుడు ప‌ద‌వి అంట‌గ‌ట్టారు. పైగా ఈ ప‌ద‌విలో ఆయ‌న ఉండేది రెండేళ్లే. ఏపీ ప్ర‌భుత్వానికి అంత స‌మ‌యం కూడా లేదు. ఈలోగానే ఎన్నిక‌లు జ‌రిగిపోతాయి. పోనీ ఇదైనా వ‌స్తుంద‌ని ఆశ ప‌డితే... అలీపై వైకాపా ముద్ర శాశ్వ‌తంగా ప‌డిపోతుంది. దాన్ని తొల‌గించుకోవ‌డానికి ఉండ‌దు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో పార్టీకి స‌పోర్ట్ గా నిల‌బ‌డ‌డం కూడా వీలు కాదు. అందుకే అలీ ఈ పోస్టు వ‌దులుకోవాల‌ని చూశార‌ని, అయితే జ‌గ‌న్ దృష్టిలో మైన‌స్ మార్కులు ప‌డ‌డం ఇష్టం లేక‌, స‌న్నిహితుల స‌హాల‌తో. త‌లొంచాల్సి వ‌చ్చింద‌ని టాక్‌.

ALSO READ: 'అనుకోని ప్రయాణం' మూవీ రివ్యూ & రేటింగ్!