ENGLISH

Garikapati, Chiru: గ‌రిక‌పాటిని చిరు ఇంకా మ‌ర్చిపోలేదా?

29 October 2022-10:00 AM

చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య జ‌రిగిన ఎపిసోడ్ గురించి ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన ప‌నిలేదు. వారం - ప‌ది రోజుల పాటు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక గా న‌డిచింది. అలాయ్ బ‌లాయ్ కార్య‌క్ర‌మంలో చిరంజీవితో అభిమానులు ఫొటోలు తీయించుకొంటుంటే.. గ‌రిక‌పాటి అలిగారు. `చిరంజీవి ఫొటో సెష‌న్ ఆప‌క‌పోతే... ఇక్క‌డ్నుంచి వెళ్లిపోతా` అంటూ చిన్న‌పిల్లాడిలా బెదిరించారు. ఆ రోజు మొద‌లు.. వారం, ప‌ది రోజులు తెలుగు నాట ఇదే హాట్ టాపిక్ గా మారింది. క‌ట్ చేస్తే... క్ర‌మంగా అంతా మ‌ర్చిపోయారు. కానీ చిరంజీవి త‌ప్ప‌.

 

శుక్ర‌వారం ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్యక్ర‌మంలో చిరు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు మ‌ళ్లీ ఆయ‌న్నిచుట్టుముట్టి ఫొటోల‌కు పోటీ ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా చిరు `ఇక్కడ వారు లేరు క‌దా..` అంటూ గ‌రిక‌పాటివారిని గుర్తు చేస్తూ సెటైర్ వ‌దిలారు. దాంతో.. అక్క‌డ వారంతా స‌ర‌దాగా న‌వ్వుకొన్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంద‌రూ మ‌ర్చిపోయినా చిరు మ‌ర్చిపోలేద‌న్న విష‌యం.... బ‌య‌ట జ‌నాల‌కు అర్థ‌మైంది. చిరు సెటైర్ తో మ‌రికొన్ని రోజుల పాటు మెగా అభిమానులు గ‌రిక‌పాటి నామ‌స్మ‌ర‌ణ చేస్తారేమో..?

ALSO READ: పాపం అలీ.. క‌క్క‌లేక మింగ‌లేక‌