ENGLISH

Rajinikanth: గేర్ మార్చిన రజనీ.. ఒకేసారి రెండు సినిమాలు

29 October 2022-11:04 AM

రజనీకాంత్‌ జైలర్ షూటింగ్ తో బిజీగా వున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే రెండు క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. ఈ వివరాలను ప్రకటిస్తూ సంస్థ ఛైర్మన్‌ సుభాస్కరన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ప్రేమ్‌శివస్వామి ఆనందం వ్యక్తం చేశారు.

 

ఆ రెండు సినిమాలను నవంబరు 5న చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాలు రూపొందనున్నాయి. ఇదే సంస్థ రజనీకాంత్‌తో గతంలో ‘2.ఓ’ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్‌ ‘జైలర్‌’ విషయానికి వస్తే ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డార్క్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ALSO READ: Garikapati, Chiru: గ‌రిక‌పాటిని చిరు ఇంకా మ‌ర్చిపోలేదా?