ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో అల్లు అర్జున్. త్రివిక్రమ్ జోడి ఒకటి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురం. ఈ మూడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. మళ్ళీ వీరి కాంబోలో మూవీ అనౌన్స్ చేసారు త్రివిక్రమ్. మహేష్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నపుడు, తన నెక్స్ట్ మూవీ బన్నీతో అని అనౌన్స్ చేసారు త్రివిక్రమ్. బన్నీ కూడా సుకుమార్ తో పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కంప్లీట్ అయ్యాక బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ పైకి వెళ్తుందని ప్రచారం జరిగింది.
కానీ గుంటూరు కారం డిజాస్టర్ తరవాత బన్నీ సందిగ్ధంలో పడ్డాడని, ఇలాంటి టైంలో త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇవ్వటం ఎందుకని సందేహించినట్లు టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప 2 తరవాత బన్నీ అట్లీతో ఒక మూవీ చేస్తాడని అనుకున్నారు. అయితే ఇవన్నీ రూమర్లేనని ఇప్పుడు రుజువయ్యింది. పుష్ప2 తరవాత అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం బన్నీ కున్న పాన్ ఇండియా లెక్కలకి తగ్గట్లు త్రివిక్రమ్ కథ రెడీ చేస్తున్నాడట, నేషనల్ స్టార్ రేంజ్ కి తగ్గ కథతో వీరిద్దరూ బరిలో దిగనున్నట్టు సమాచారం.
త్రివిక్రమ్ సినిమాలు ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. తెలుగులో త్రివిక్రమ్ డైలాగ్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పడు మొదటిసారిగా బన్నీతో పాన్ ఇండియా దండయాత్రకి సిద్ధం అవుతున్నాడు. అందుకని పాన్ ఇండియా కథని సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. గుంటూరు కారంతో వచ్చిన నెగిటివిటీ పోగొట్టుకోవాలని త్రివిక్రమ్ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. బన్నీ కూడా గురూజీ కి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇందుకోసం మైథలాజికల్ టచ్ తో సోషియో ఫాంటసీ కథని సిద్ధం చేసినట్లు, బడ్జెట్ 500 వందల కోట్లు అని, ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పడుతుందని ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచారు బన్నీవాసు.