ENGLISH

రాజమౌళి పై బాలీవుడ్ అక్కసు

02 October 2024-16:58 PM

రాజమౌళి పేరు ఇండియన్ సినిమా హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇండియాకి ఆస్కార్ రాదన్న నిరాశను చెరిపేసి రెండు ఆస్కార్ లు వచ్చేలా చేసాడు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచింది జక్కన్నే అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకుంటారు. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే అని ఉన్న ముద్రని చెరిపేసి ప్రపంచానికి తెలుగు సినిమాని పరిచయం చేసారు రాజమౌళి. కెరియర్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు పొందారు జక్కన్న. ఒక తెలుగు దర్శకుడు ఆస్కార్ మెంబర్ గా కూడా నియమించిబడ్డాడు. 


హాలీవుడ్ నటులు, దర్శకులు కూడా రాజమౌళిని ప్రశంసిస్తారు. ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మన జక్కన్నని బాలీవుడ్ అవమానించింది. రీసెంట్ గా దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీఖాన్ కపిల్ షోకి వెళ్లారు. ఈ షోలో భాగంగా కొందరు కమెడియన్స్ ని పిలిచి కొంచెం కామెడీ పంచె ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా సునీల్ గ్రోవర్ ఈ కామెడీ వేషాలు వేస్తుంటాడు. ఎవరో ఒక సెలబ్రిటీ గెటప్ లో వచ్చి, వారిని ఇమిటేట్ చేస్తుంటాడు. ఇవి శృతిమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడూ అదే జరిగింది. కావాలని చేసారా? లేదా అనుకోకుండా జరిగిందా అని పక్కన పెడితే ఈ షో లో రాజమౌళి పై విమర్శలు హద్దులు దాటాయి.    


ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ పాల్గొన్న ఈ షో లో సునీల్ గ్రోవర్ జక్కన్న గెటప్ లో వచ్చి, రాజమౌళిని ఇమినేట్ చేస్తూ కామెడీ చేసాడు. ఈ క్రమంలోనే 'రాజగోళి' అని చెప్పటం, ఒక కథ చెప్తాను కమర్షియల్ సినిమా అంటూ ఒక లైన్ చెప్పి, ఆ తర్వాత VFX, VFX అని, అంటూ ఇండైరక్ట్ గా  రాజమౌళి కమర్షియల్ సినిమా పేరు చెప్పి, సినిమా మొత్తం VFX లతోనే పూర్తి చేస్తాడని కామెడీ చేసాడు. టోటల్ గా జక్కన్న పై విమర్శలు చేస్తూ సునీల్ కామెడీ చేసాడు. గ్రేట్ ఇండియన్ షో గా పేరు తెచ్చుకున్న కపిల్ షో లో ఒక లెజండరీ దర్శకుడి పై ఇలాంటి కామెడీ చేయటం బాలీవుడ్ అహంకారానికి నిదర్శనం అని ఫాన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ లో సునీల్ కామెడీ సూపర్ అని, ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.