ENGLISH

కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ మధ్యలో నాగ్

02 October 2024-18:32 PM

రాజకీయాల నుంచి వ్యక్తిగత విమర్శలకీ దారి తీస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. తిరుమల లడ్డు వివాదం పవన్, ప్రకాష్ రాజ్ మధ్య చిచ్చు పెడితే. తెలంగాణ పొలిటికల్ వార్ లో నాగార్జున ఫ్యామిలి ఇబ్బంది పడుతోంది. తెలంగాణాలో కాంగ్రెస్, BRS  మధ్య జరుగుతున్న వార్ లో కొండా సురేఖ, కేటీఆర్ మధ్య విమర్శలు నాగ్ ఫ్యామిలీ వరకు వెళ్లాయి. ప్రజంట్ కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చాలా మంది హీరోయిన్స్ ని వేధించారని, వారికి డ్రగ్స్ అలవాటు చేసి, రేవు పార్టీలకి పిలిచి, తరువాత వారిని బ్లాక్ మెయిల్ చేసేవారని సురేఖ పేర్కొన్నారు. 


అందుకే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ ని వదిలి వెళ్లిపోతున్నారని, ఇంకొందరు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతున్నారని వ్యాఖ్యానించారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం కూడా కేటీఆర్ అని కామెంట్ చేసారు సురేఖ. ఎన్. కన్వెన్షన్ కూల్చి వేతపై బీఆర్ఎస్ నాగ్ ని టార్గెట్ చేయగా, దీనిని ఆపటానికి నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ సమంత ని KTR దగ్గరికి వెళ్లముని బలవంతం పెట్టినట్లు, సామ్ నిరాకరించటంతో వారు డివోర్స్ తీసుకున్నట్లు కొండా సురేఖ ఆరోపించారు. 


దీనిపై నాగార్జున స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యల్నిఖండించారు. సురేఖ చెప్తున దాంట్లో నిజం లేదని, రాజకీయ లబ్ది కోసం అసలు సంబంధమే లేని వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి వారి కుటుంబాల్ని బాధ పెట్టొద్దని నాగ్ హెచ్చరించారు. 'గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని ఖండిస్తున్నాను. ఎడిటివారి వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మీరు చేసే ఈ వ్యాఖ్యలు, మా కుటుంబం గూర్చి మీరు చేసిన  ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను' అని నాగార్జున ఎక్స్‌లో  పోస్ట్ చేసారు.