ENGLISH

మ‌హేష్ కోసం న‌లుగురు సంగీత ద‌ర్శ‌కులు

03 October 2024-11:01 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజ మౌళి కాంబినేషన్ లో ఒక మూవీ అనౌన్స్ చేశారు. జక్కన్న మొదటిసారిగా మహేష్ బాబుతో వర్క్ చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి మొదలైంది. ఆడియన్స్ అంచనాలను అందుకునేలా ఈ మూవీ కథని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథతో , భారీ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందే ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాకి సంభందించిన అప్డేట్స్ ఏమి రాలేదు. దసరాల్లో పూజా కార్యక్రమాలు ఉంటాయని, నవంబర్, డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని టాక్. అప్పుడు మిగతా డిటైల్స్ తెలిసే అవకాశం ఉంది. 


అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీకోసం జక్కన్న నలుగురు మ్యూజిక్ డైరక్టర్స్ ని రంగంలోకి దింపనున్నారట. సాదారణంగా రాజమౌళి సినిమాలకి కీరవాణి సంగీతం అందిస్తారు. జక్కన్న మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ వన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన RRR వరకు కీరవాణి మ్యూజిక్ కూడా సినిమాకి కలిసి వచ్చేది. RRR తరవాత రాజమౌళి పాన్  వరల్డ్ దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. రాజమౌళి సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో అందరి అంచనాలు రీచ్ అయ్యేలా, సినిమాకి ఆత్మ లాంటి సంగీతం విషయంలో కూడా మరింత ఆసక్తి కలిగించేలా ఏకంగా నలుగురు టాప్ మ్యూజిక్ డైరక్టర్స్ ని తన సినిమాకి ఫిక్స్ చేసినట్టు ఫిలిం నగర్ టాక్. 


SSMB29 కి ఇద్దరు ఆస్కార్ విజేతలు, ఇద్దరు సెన్షనల్ సంగీత దర్శకులు వర్క్ చేయనున్నారు. వీరిలో కీరవాణి, AR రెహమాన్ పాటలు కోసం సంగీతం అందిస్తారని, యూత్ నాడి తెలిసిన సంగీత ప్రభంజనం అనిరుద్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది.  వీరిలో ఒక్కరుంటేనే తమ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తారు. అలాంటిది నలుగురు మ్యూజిక్ స్టార్స్ కలిస్తే ఇంకేమైనా ఉందా! పోలె ? అదిరిపోలే ? అన్నట్టు ఉంది జక్కన్న ప్లాన్.