ENGLISH

బన్నీతో అనూ ఇమ్మాన్యుయేల్‌ హాటెస్ట్‌ సెల్ఫీ

19 April 2018-18:44 PM

అల్లు అర్జున్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఇది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ ఫోటోకి పెద్ద స్టోరీనే ఉందండోయ్‌. 

అల్లు అర్జున్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ కలిసి చాలా రోజులుగా సినిమా కోసం ట్రావెల్‌ అవుతున్నారు. అయితే ఇన్నాళ్ల ట్రావెలింగ్‌లో అనూ ఇమ్మాన్యుయేల్‌ ఒకే ఒక్క కోరిక కోరిందట అల్లు అర్జున్‌ని. అదేంటంటారా? సెల్ఫీ. అంతేకదా. అనుకున్నారా? మన బన్నీ కూడా అలాగే అనుకున్నాడు. అందుకే ఇదిగో వెంటనే ఆ కోరిక తీర్చేశాడు. హాట్‌ హాట్‌గా అనూతో సెల్ఫీ దిగేశాడు. నిజంగానే ఈ సెల్ఫీ సో హాట్‌గా ఉంది కదా. 

అనూతో ఫస్ట్‌ పర్సనల్‌ పిక్చర్‌ ఇది అని హ్యాష్‌టాగ్‌ కూడా పెట్టేశాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగ్‌ లాస్ట్‌ డే నాడు తీసిన ఫోటో అట ఇది. ఇప్పుడీ ఫోటో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో 'ఐ' షేప్‌ వీరి సెల్ఫీకి మరింత అందాన్ని, ఆకర్షనను తీసుకొచ్చింది. 

మే 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత అనూ ఇమ్మాన్యుయేల్‌ నటించిన సినిమా ఇది. ఈ సినిమాపై అనూ పాపం చాలానే ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి, ఏం జరుగుతుందో.

ALSO READ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీ రెడ్డి?!