పుష్ప మానియా దేశమంతా పాకింది అనటానికి ఉదాహరణ తాజాగా పాట్నాలో జరిగిన ఈవెంట్. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. బన్నీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని, ఓ పెద్ద గ్రౌండ్ లో గ్రాండ్ గా ఈ ఈవెంట్ ని ఎరేంజ్ చేసారు మేకర్స్. అల్లు అర్జున్ హవా నార్త్ లో ఏ రేంజ్ లో ఉందో ఈవెంట్ కి వచ్చిన జనాల్ని చూస్తే అర్థం అవుతోంది. నార్త్ లో ఒక తెలుగు సినిమాకి ఇంతటి క్రేజ్ ఉండటం, కేవలం ట్రైలర్ ఈవెంట్ కి ఇంత భారీగా రెస్పాండ్ రావటం విశేషం. ఈ ఈవెంట్ పుష్ప 2 కి పాజిటీవ్ వైబ్రేషన్స్ ని మరింత పెంచింది. పైగా పుష్ప 2 కి సంబంధించి జరిగిన మొదటి ఈవెంట్ ఇదే కావటం గమనార్హం.
బీహార్ గవర్న మెంట్ కూడా ఈ ఈవెంట్ ని అంతే శ్రద్దగా ప్లాన్ చేసింది. ఒక్క సినిమా ఈవెంట్ కోసం అదీ తెలుగు సినిమా ట్రైలర్ కోసం 900 మంది పోలీసులను, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించింది. మొత్తం ఈ ఈవెంట్ కోసం బీహార్ సర్కార్ ఏకంగా 1200 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ హైలెట్స్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలిచింది పుష్ప 2 . సుమారు 2 లక్షల మంది ఈవెంట్ కు వచ్చారు. ఇసుక వేస్తె రాలనంత జనం. పాట్నాలో ఒక తెలుగు హీరో పై ఇంత ప్రేమ చూపటం అరుదైన విషయం. ఇది బాలీవుడ్ కి మింగుడుపడని నిజం.
గ్రౌండ్ లో ఉన్న జనాల్ని చూస్తే పాట్నాలా లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతమంది జనం వచ్చి ఉండేవారు కాదేమో అనిపించింది పాట్నాలో జనాల్ని చూసి. కేవలం పాతిక వేల పాసులు ఇస్తే, 2 లక్షల మంది రావటం మామూలు విషయం కాదు. పాస్‌లను బ్లాక్ లో టికెట్లు అమ్మినట్టు అమ్మారని తెలుస్తోంది. బన్నీ, రష్మిక స్పెషల్ ఫ్లయిట్ లో పాట్నా చేరుకోగా దారి పొడవునా వీరికి ఘన స్వాగతం లభించింది. మొత్తానికి పుష్ప వైల్డ్ ఫైర్ అనిపించుకున్నాడు.