ENGLISH

మరో వివాదంలో విశ్వక్ సేన్

18 November 2024-11:24 AM

మొదటి నుంచి విశ్వక్ సేన్ ఎక్కడుంటే అక్కడ వివాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. తనకి తానే కోరి వివాదాలు తెచ్చుకుంటుంటాడు. జనరల్ గా ఒక హీరో ఫాన్స్ ఇంకొక హీరో ని టార్గెట్ చేస్తుంటారు. ఇది కామన్ ఇలాంటి విషయాల్లో మౌనంగా పోవటమే బెటర్. ఇంకొందరు చిన్న హీరోలని బాగా టార్గెట్ చేస్తుంటారు. యారగెంట్ అని, ఆటిట్యూడ్ అని. వాటిని పర్సనల్ గా తీసుకుని ఆవేశపడితే మరింత డ్యామేజ్ జరగటం ఖాయం. అదే చూసి చూడనట్లు వదిలేస్తే ఓ రెండుమూడు సార్లు తరవాత ఇక అనటం మానేస్తారు. కానీ విశ్వక్ సేన్ ఇందుకు విరుద్ధం. తన ప్రతి సినిమా రిలీజ్ ముందు ఏదో అనటం, దాని చుట్టూ  వివాదాలు కామన్ అయిపోయింది.

రిలీజ్ ముందు చేసే కామెంట్స్ ఆ మూవీపై ఎంతో కొంతో ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ప్రస్తుతం విశ్వక్ మెకానిక్ రాకీ సినిమాతో నవంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సంధర్భంగా ఆదివారం వరంగల్ లో 'మెకానిక్ రాకీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ 'మీకే చెప్తున్నా, మీరు నన్ను ఏమి పీకలేరు. నేను ఇలాగే మాట్లాడతా. ఇలాగే నా సినిమాని ప్రమోట్ చేసుకుంటా. నేనేమి తప్పు చెయ్యట్లేదు. సినిమాలు చేస్తున్నాం. నన్ను ట్రోల్ చేసిన వాళ్ళను, నా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను నేనేమి అనను. ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూయర్స్, ట్రోలర్స్ గురించి మాట్లాడను. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా పర్వాలేదు కానీ పర్సనల్ లెవెల్ లో ఎటాక్ చేయొద్దని హెచ్చరించాడు.

క్రిటిక్స్ రివ్యూస్ తప్పుల్ని దిద్దుకోవటానికి మోటివేషన్ అని, పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉందని, ఈ సినిమా తర్వాత రివ్యూస్, క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు అంతే బాధ్యతగా ఉండాలని మనవి చేసాడు. ఒక పక్క హెచ్చరికలు, ఇంకో వైపు విన్నపాలు చేస్తూ స్పీచ్ ఇవ్వటం గమనార్హం. ప్రస్తుతం విశ్వక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.