ENGLISH

బ‌న్నీ మాస్ట‌ర్ ప్లాన్ తో రూ.5 కోట్లు లాభం

08 June 2017-11:16 AM

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఈనెల 23న రాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఈ సినిమాపై అంచ‌నాలు పెంచేశాయి. దానికి తోడు మంచి సీజ‌న్‌లో విడుద‌ల కాబోతోంది. బ‌న్నీకి పోటీగా పెద్ద సినిమాలేం లేవు. కాబ‌ట్టి.. సినిమా బాగుంటే.. రికార్డు వ‌సూళ్లు ద‌క్కించుకోవ‌డం ఖాయం. ఈ సినిమాపై బ‌న్నీకి ముందు నుంచీ భారీ అంచ‌నాలున్నాయి. అందుకే... ఈసారి తెలివైన ఎత్తుగ‌డ వేశాడు. బ‌న్నీ త‌న పారితోషికం బ‌దులుగా తూర్పు, ప‌శ్చిమ‌, కృష్ణా జిల్లాల రైట్స్ రాయించుకొన్నాడ‌ట‌. ఈ మూడు ఏరియాల నుంచి దాదాపుగా రూ.15 కోట్లు వ‌ర‌కూ రావొచ్చ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. మామూలుగా అయితే. .. బ‌న్నీ పారితోషికం రూ.10 కోట్ల‌లోపే. అంటే.. డీజే తో రూ.5 కోట్లు లాభం అన్న‌మాట‌. బ‌న్నీ మాస్ట‌ర్ ప్లాన్ అదిరిపోయింది క‌దూ..!

ALSO READ: హీరోయిన్ పై కన్నడ నిర్మాత వేదింపులు?!