ENGLISH

బన్నీ రేంజ్‌ ఆ స్థాయికి పెరిగింది

30 December 2020-12:30 PM

సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌కి ఫాన్‌ ఫాలోయింగ్‌ చాలా చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎంత స్టయిలిష్‌ టార్‌ అయినా, తానూ మెగాస్టార్‌ అనే చెట్టు నీడన ఓ హీరోని మాత్రమేనంటాడు అల్లు అర్జున్‌. అది అతని సంస్కారం. ఆ విషయాన్ని పక్కన పెడితే, సోషల్‌ మీడియా వేదికగా మాత్రం అడపా దడపా అల్లు అర్జున్‌ అభిమానులకీ, కొందరు మెగాభిమానులకీ మధ్య యుద్ధం జరుగుతూనే వుంది.

 

అయితే, మెగాభిమానులెవరూ అల్లు అర్జున్‌ని ట్రోల్‌ చేసే అవకాశం వుండదనీ, మెగా అభిమానుల్లో చీలిక తెచ్చేందుకు కొన్ని అసాంఘీక శక్తులు పవన్‌ అభిమానులమనో, చరణ్‌ అభిమానులమనో చెప్పుకుని అల్లు అర్జున్‌ని ట్రోల్‌ చేస్తుంటారనీ మెగా అభిమానుల సంఘాలకు చెందిన కొందరు చెబుతుంటారు. ఇందులో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తాజాగా అల్లు అర్జున్‌పై 'మెగాస్టార్‌' పేరుతో విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతోంది. ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అల్లు అర్జున్‌ని మెగాస్టార్‌గా అభివర్ణించడమే దీనంతటికీ కారణం.

 

తమ అభిమాన హీరోపై ట్రోలింగ్‌ నేపథ్యంలో 'అల్లు అర్జున్‌ ఆర్మీ' కూడా అలర్ట్‌ అయ్యింది. యాంటీ ఫ్యాన్స్‌కి ధీటుగా ఈ ఆర్మీ సమాధానం చెబుతోంది. సోషల్‌ మీడియాలో ఈ పైత్యం, తమిల సినీ పరిశ్రమలో కన్పించే పైత్యాన్ని మించిపోతోంది. స్వయంగా మెగా కాంపౌండ్‌ ఇలాంటి వివాదాలపై పరోక్షంగా పలు సార్లు స్పందించినా, సోకాల్డ్‌ దురభిమానుల్లో మాత్రం మార్పు రావడంలేదు.

ALSO READ: టాలీవుడ్‌లో సీనియర్‌ హీరో సరసన కళ్యాణి