ENGLISH

'వకీల్‌ సాబ్‌' అదంతా ఉత్తదేనని తేలిపోయింది

30 December 2020-11:44 AM

'వకీల్‌ సాబ్‌' సినిమా షూటింగ్‌ చాలా చాలా జరగాల్సి వుందంటూ నిన్న మొన్నటిదాకా కొత్త ప్రచారం తెరపైకొచ్చింది. సినిమాలో చాలా మార్పులు చేయబోతున్నారనీ, ఈ క్రమంలో సినిమా షూటింగ్‌ ఆలస్యమయ్యిందనీ, దాంతో 'వకీల్‌సాబ్‌' సంక్రాంతికి కూడా విడుదలవడం కష్టమేనంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, అనూహ్యంగా 'వకీల్‌ సాబ్‌' సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.

 

సో, 'వకీల్‌సాబ్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చన్నమాట. నిజానికి, అన్నీ కుదిరితే సంక్రాంతికే వకీల్‌ సాబ్‌ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలనుకున్నారు చిత్ర నిర్మాతలు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. ఆ మాటకొస్తే, 2020 వేసవిలోనే 'వకీల్‌ సాబ్‌' విడుదలైపోయి వుండాలి. కరోనా దెబ్బతో 'వకీల్‌ సాబ్‌' వాయిదా పడింది.

 

ఇంతకీ, 'వకీల్‌ సాబ్‌' సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది.? ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఒకింత కష్టమే. షూటింగ్‌ పూర్తయిపోతే సరిపోదు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వ్యవహారాలుంటాయి. కరోనా భయాల నేపథ్యంలో అన్ని లెక్కలూ పక్కాగా వేసుకునే 'వకీల్‌సాబ్‌' థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. పూర్తిస్థాయిలో థియేటర్లు ప్రేక్షకులతో నిండినప్పుడే 'వకీల్‌సాబ్‌' విడుదలవుతుందా.? '50 శాతం ఆక్యుపెన్సీ'తో సరిపెట్టుకోక తప్పదా.? వేచి చూడాల్సిందే.

ALSO READ: బాలీవుడ్‌లో రష్మిక హల్‌చల్‌.. అప్పుడేనా.?