ENGLISH

టాలీవుడ్‌లో సీనియర్‌ హీరో సరసన కళ్యాణి

30 December 2020-10:07 AM

'హలో' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కళ్యాణి ప్రియదర్శన్‌, తొలి సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సాయి ధరమ్‌ తేజ్‌ సరసన నటించిన 'చిత్రలహరి' సినిమా మాత్రం ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. గ్లామర్‌ విషయంలో కొంత మొహమాటపడే కళ్యాణి ప్రియదర్శన్‌, నటిగా మాత్రం తానేంటో ఇప్పటికే ప్రూవ్‌ చేసేసుకుంది. ఇదిలా వుంటే, తాజాగా ఓ సీనియర్‌ హీరో సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్‌కి ఛాన్స్‌ వచ్చిందట.

 

అయితే, అది హీరోయిన్‌ పాత్రా.? లేదంటే, సినిమాలో కీలకమైన పాత్ర ఏదన్నానా.? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. కాగా, కళ్యాణి ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లోనూ, కొన్ని మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. 'హీరోయిన్‌గా వరుస సినిమాలు చేసెయ్యాలనే తాపత్రయం ఏమీ నాకు లేదు. అవకాశాల కోసం హద్దులు మీరిన గ్లామర్‌కి నేను సుముఖంగా లేను.

 

నాకంటూ కొన్ని లిమిట్స్‌ వున్నాయి. వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తాను..' అంటోంది కళ్యాణి ప్రియదర్శన్‌. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా, గ్లామర్‌ సహా అనేక అంశాలపై కళ్యాణి మొహమాటాలు.. ఆమె కెరీర్‌కి అడ్డంకిగా మారుతున్నాయన్న వాదనలున్నాయి. కళ్యాణి మాత్రం, నటనతోనే మెప్పిస్తానంటోంది. అలాగని, గ్లామర్‌కి తానేమీ వ్యతిరేకం కాదనీ చెబుతుండడం గమనార్హం.

ALSO READ: Kalyani Priyadarshan Latest Photoshoot