'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమా త్వరలో రిలీజ్‌కి రెడీగా ఉంది. జూన్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగానే బన్నీ కొత్త సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబంధించి టైటిల్‌ని రిలీజ్ చేశారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టారు. టైటిల్ చాలా కొత్తగా ఉంది. కొంచెం లెంగ్త్ ఎక్కువైనా ఈ మధ్య ఈ టైప్ టైటిల్స్‌కే ఎక్కువ పాపులారిటీ దక్కుతోంది. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో డైరెక్టర్‌గా అవతారమెత్తనున్నాడు. ఈ సినిమా గురించి వంశీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో తన డైరెక్షన్‌లో తొలిసారి సినిమా తెరకెక్కించాలని ఆశించాడు వక్కంతం వంశీ. కానీ ఎన్టీఆర్‌తో కుదరలేదు. బన్నీకి ఈ స్టోరీ లైన్ వినిపించగానే వెంటనే ఓకే చేశాడు. అయితే ఈ సినిమా గురించి ఇంతవరకూ ఎలాంటి గాసిప్ బయటికి రాలేదు. సడెన్‌గా టైటిల్ అనౌన్స్ చేసి బన్నీ షాక్ ఇచ్చాడు తన ఫ్యాన్స్‌కి. ఎప్పట్నుంచో డైరెక్టర్ అవ్వాలనుకుంటున్న వక్కంతం వంశీ కోరిక ఇప్పటికి తీరబోతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. లగడపాటి శిరీష, బన్నీ వాస్ ఈ సినిమాకి నిర్మాతలు. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్ర యూనిట్.
ALSO READ: పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన పవన్.!