మంచు మనోజ్ 'దొంగ దొంగది' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. 'బిందాస్' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ మధ్యనే 'గుంటూరోడు' సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'ఒక్కడు మిగిలాడు' సినిమాలో నటిస్తున్నాడు. విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మంచు మనోజ్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సంబంధం లేకుండా తన సినిమాతో ఆడియన్స్‌కి ఏదో చెప్పాలనుకునే తపనతో, ఎంతో పేషన్‌తో సినిమాలు చేసుకుంటూ పోతాడు. అయితే తాజాగా మంచు మనోజ్ ''ఒక్కడు మిగిలాడు', ఇంకో సినిమా హీరోగా ఇవే నా చివరి చిత్రాలు..' అభిమానులకి థాంక్స్ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఈ తాజా పోస్ట్‌తో అందరూ షాక్ తిన్నారు. ఏంటి తర్వాత మనోజ్ సినిమాలు చేయడా? అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. వివరాలు చెప్పలేదు మనోజ్. అయితే మనోజ్‌కి నటన మీద కన్నా ఇతరత్రా వ్యాపకాలపై ఆశక్తి ఎక్కువ. తన సినిమాలకు తానే ఫైట్స్ కంపోజ్ చేసుకుంటూ ఉంటాడు. సినిమాకి సంబంధించి చాలా అవగాహన ఉంది మనోజ్‌కి. స్క్రిప్టు రైటింగ్‌లోనూ మనోజ్‌కి టచ్ ఉంది. అలాగే నిర్మాణంపై కూడా మక్కువ ఉందని తెలుస్తోంది. అయితే ఎందుకు ఇంత సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకున్నాడో మనోజ్ అర్ధం కావట్లేదు. ఆ తర్వాత అసలు సినీ రంగంలోనే ఉంటాడా? లేక మరే ఇతరత్రా రంగంలోకైనా అడుగు పెడతాడా అనేది మనోజ్ చెబితే కానీ తెలీదు.
ALSO READ: పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన పవన్.!