ENGLISH

పుష్ష 1.. క్లైమాక్స్ ట్విస్ట్ అదే!

02 July 2021-12:00 PM

'పుష్ష' రెండు భాగాలుగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్ గా క‌నిపిస్తాడ‌ని చిత్ర‌బృందం ముందు నుంచీ చెబుతూనే ఉంది. అయితే బ‌న్నీలో మ‌రో కోణం ఉంది. త‌ను ఈ సినిమాలో డాన్ అవ‌తారం ఎత్తుతాడు. అదే ఫ‌స్టాఫ్ లో ప‌తాక స‌న్నివేశం. ఎర్ర చంద‌నం స‌ప్ల‌య్ చేసే లారీకి డ్రైవ‌ర్ అయిన పుష్ష‌.. ఎర్ర చంద‌నం సామ్రాజ్యంలో కొమ్ములు తిరిగిన వాళ్ల‌ని ఎదుర్కొని, వాళ్ల ఆధిప‌త్యానికి గండి కొట్టి, డాన్ గా ఎద‌గ‌డంతో `పుష్ష 1` పూర్త‌వుతుంది.

 

ఆ త‌ర‌వాత డాన్ గా తానేం చేశాడు? శ‌త్రువులంతా క‌లిసి... పుష్ష‌ని ఎలా ఢీ కొట్టారు అనేది పార్ట్ 2లో చూడొచ్చు. ఈ చిత్రంలో దాదాపు ఎనిమిదిమంది విల‌న్లు ఉంటారు. ప్ర‌ధాన విల‌న్ మాత్రం మ‌ల‌యాళ న‌టుడు ఫాజిలే. అయితే పార్ట్ 1లో ఫాజిల్ పాత్ర చాలా స్వ‌ల్ప‌మ‌ని, ద్వితీయార్థం మొత్తం.. ఫాజిల్ క‌నిపిస్తాడ‌ని టాక్‌. ఈ చిత్రంలో సునీల్ కూడా ఉన్నాడు. అయితే త‌నది నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర‌. తొలి భాగంలో సునీల్ డామినేష‌న్ క‌నిపిస్తుంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.

ALSO READ: త‌మిళ ద‌ర్శ‌కుడి వైపు.. బ‌న్నీ చూపు?!