ENGLISH

డిజాస్ట‌ర్ త‌ప్పించుకున్న మెగా హీరోలు.

07 September 2020-10:15 AM

నాని 25వ సినిమా `వి`. ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాపై ఎన్ని ట్రోల్సో. ఇంద్ర‌గంటి ఇలాంటి క‌థ త‌యారు చేశాడేంటి? దాన్ని నాని ఎలా ఒప్పుకున్నాడు? వీరిద్ద‌రూ దిల్ రాజుని ఎలా ఒప్పించారు? అంటూ ఎన్ని అనుమానాలో..? నిజానికి ఈ ఫ్లాపు.. మెగా హీరోల ఖాతాలో ప‌డాల్సింద‌ని టాక్‌. అవును.. ఈ క‌థ ముందుగా అల్లు అర్జున్ కి వినిపించార్ట‌. నాని పాత్ర‌ని బ‌న్నీతోనూ, సుధీర్ బాబు పాత్ర సాయిధ‌ర‌మ్ తేజ్ తోనూ చేయిద్దాం అని దిల్ రాజు ప్లానింగ్. అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర‌వాత‌.. వ‌రుణ్ తేజ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌.

 

నాని పాత్ర వ‌రుణ్ చేస్తే, పోలీస్ పాత్ర - సాయిధ‌ర‌మ్ తో చేయిద్దామ‌ని. కానీ వ‌రుణ్ కూడా ఒప్పుకోలేదు. అలా.. మెగా హీరోలు `నో` చెప్పిన త‌ర‌వాతే.. ఈక‌థ నాని - సుధీర్ బాబు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌ట‌. నానికి ఇంద్ర‌గంటి అంటే ప్ర‌త్యేక‌మైన అభిమానం. క‌థ ఎలా ఉన్నా, ఆయ‌న మ్యాజిక్ చేస్తాడ‌ని గ‌ట్టిగా న‌మ్మాడు. అందుకే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కింది. కానీ... తీరా చూస్తే ప‌ల్టీకొట్టింది. ఏం చేస్తాం..? బ్యాడ్ ల‌క్‌. నాని 25వ సినిమా ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాన్ని మూట గ‌ట్టుకుంది.

ALSO READ: 15మందితో.. షూటింగ్ రెడీ!