ENGLISH

15మందితో.. షూటింగ్ రెడీ!

07 September 2020-09:00 AM

సినిమా సెట్ అంటే ఎంత హ‌డావుడి..? హీరో చుట్టూ ప‌దిమంది, హీరోయిన్ సిబ్బంది, ద‌ర్శ‌కుడు, స‌హాయ ద‌ర్శ‌కులూ, లైట్ బోయ్స్‌, మేనేజ‌ర్లూ.. ఎంత హంగామా ఉంటుంది? క‌నీసం 150 మంది లేక‌పోతే... షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టే ఉండ‌దు. కానీ.. క‌రోనా కాలం క‌దా. అంత‌మందితో షూటింగ్ అంటే ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు ఒప్పుకోవ‌డం లేదు. 40 మంది మించ‌కుండా షూటింగులు చేసుకోండి అని - హ‌ద్దులు గీస్తున్నారు. 40 మందితో షూటింగ్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ వీలు కాని విష‌యం. అందుకే పెద్ద సినిమాల షూటింగులేవీ మొద‌లు కాలేదు.

 

కానీ శేఖ‌ర్ కమ్ముల `ల‌వ్ స్టోరీ` 15 మంది టీమ్ స‌భ్యుల‌తోనే మొద‌లెట్టేశారు. నాగ‌చైత‌న్య - సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్ర‌మిది. ఈరోజే కొత్త షెడ్యూల్ ప్రారంభ‌మైంది. కేవ‌లం 15మంది టీమ్ సభ్యుల‌తోనే షూటింగ్ మొద‌లెట్టారు. కోవిడ్ నిబంధ‌నల‌న్నీ పాటిస్తూ, షూటింగ్ మొద‌లెట్టామ‌ని, ఒక్క షెడ్యూల్ తో సినిమాని పూర్తి చేస్తామ‌ని చిత్ర‌బృందం చెప్పింది. ద‌స‌రాకి ఈ సినిమాని విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం. అప్ప‌టికి థియేట‌ర్లు తెర‌చుకుంటేనే. లేదంటే... 2020లోనే ఈ ల‌వ్ స్టోరీని చూడ‌గ‌లం.

ALSO READ: ఎఫ్ 3కి మంచి రోజులొచ్చాయ్‌!